Ads
తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఒక 14 ఏళ్ల అమ్మాయి తన తోబుట్టువులకి తల్లిగా మారి, వారి ఆలనాపాలనా చూసుకుంటున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈటీవీ తెలంగాణ కథనం ప్రకారం నజ్మా నిజామాబాద్ లోని బోధన్ నివాసి. నజ్మా కి మూర్ఛ వ్యాధి ఉంది. నజ్మా తండ్రి సలీం తల్లి తాహెరా పాములు పట్టే వ్యాపారం చేసే వాళ్ళు. వీరికి 11 మంది పిల్లలు అందులో ఐదుగురు బతికారు.
Video Advertisement
సలీం కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో తాహెరా భిక్షాటన చేసి తన పిల్లలను పోషించేవారు. ఏడాది క్రితం తాహెరా కామెర్ల వ్యాధితో మరణించారు. చనిపోతూ నజ్మా కి తన సోదరి సోదరులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అప్పటి నుంచి నజ్మా తన తోబుట్టువులను చదివిస్తోంది. చుట్టుపక్కల వాళ్ళు డబ్బులు పోగు చేసుకొని తాహెరా అంత్యక్రియలు జరిపించారు.
వారే నజ్మా కి ఉండడానికి ఒక ఒక పూరి గుడిసె ఏర్పాటు చేయించారు. 5 రోజుల క్రితం వర్షంలో తడవడం వల్ల నజ్మా ఉన్న మూర్ఛ వ్యాధి తిరగబెట్టడంతో నజ్మా ఆస్పత్రిలో చేరింది. అక్కడ తన తల్లిదండ్రుల గురించి అడగగా నజ్మా ఈ విషయాన్ని చెప్పింది. భిక్షాటన చేసిన డబ్బులతో సరుకులు తీసుకొచ్చి తన తోబుట్టువులకు తిండి పెడుతున్నాను అని, అలాగే తన ఇద్దరు తమ్ముళ్లని హాస్టల్ లో పెట్టి చదివిస్తున్నాను అని ఇంకొక చెల్లి, తమ్ముడు తనతోనే ఉంటారు అని చెప్పింది.
నజ్మా పరిస్థితి గురించి తెలుసుకున్న ఆ ఊరి అంగన్వాడీ కార్యకర్త అయిజాజ్ బేగం, సిడిపిఓ వినోద, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు రాధిక, నజ్మా ఇంటికిి వెళ్లి పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి నజ్మా ఆరోగ్యాన్ని పరిశీలించి, తర్వాత నిజామాబాద్ లోని సఖి కేంద్రాని తరలించారు. అక్కడ అదనపు వైద్య పరీక్షలు నిర్వహించారు.
watch video :
End of Article