Home Filmy Adda Pushpa First Single : పుష్ప ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ఆర్ ఆర్ ఆర్ టైపులోనే ప్రమోషనల్ స్ట్రాటజీ

Pushpa First Single : పుష్ప ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ఆర్ ఆర్ ఆర్ టైపులోనే ప్రమోషనల్ స్ట్రాటజీ

by Sunku Sravan

టాలీవుడ్ లో టాప్ స్థాయిని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా చిత్రాన్ని అటెంప్ట్ చేస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్పలో టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. పుష్పను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 చిత్రీకరణ చివరి దశలో ఉంది.

pushpa first single

pushpa first single

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈరోజు దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా పుష్పకు సంబంధించి మొదటి అప్డేట్ ను ఇచ్చారు.

SUKUMAR : దర్శకుడు సుకుమార్ కు ఏమైంది…? “పుష్ప” షూటింగ్ ఎందుకు ఆగిపోయింది..?

పుష్ప మొదటి సింగిల్ ను ఆగష్టు 13న విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ ను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఒక్కో భాషలో ఒక్కో సింగర్ ఈ పాటను పాడాడు. “దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుతుంది పీక” సాంగ్ ను తెలుగులో శివమ్ పాడాడు. హిందీలో విశాల్ దద్లాని, కన్నడలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్, తమిళ్ లో బెన్నీ దయాల్ ఈ సాంగ్ ను పాడారు.

ఈ పాటతో పుష్ప ప్రమోషన్స్ కు తెర తీసారని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

You may also like