Ads
గత కొన్ని రోజుల నుండి ఒక యువతి రోడ్డు మీద ఒక కార్ డ్రైవర్ ని కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన లక్నోలో జరిగింది. ఈ వీడియో గమనించినట్లయితే ఆ యువతి, ఆ వ్యక్తిని కొట్టి, అతని ఫోన్ పగలగొట్టి, అలాగే వాళ్ళ గొడవ ఆపడానికి వచ్చిన వ్యక్తి మాట కూడా వినకుండా మళ్లీ ఆ కార్ డ్రైవర్ ని కొట్టడం మొదలు పెట్టింది. ఎందుకు అలా చేస్తోంది అని అడిగితే, ఆ వ్యక్తి తన కారుతో ఆ యువతి కార్ ని ఢీ కొట్టాడు అని చెప్పింది.
Video Advertisement
ఈ వీడియోని ట్విట్టర్ లో మేఘ్ అప్డేట్స్ అనే పేజ్ షేర్ చేసింది. తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది చూసిన చాలా మంది నెటిజన్లు “సాధారణంగా ఇదే పని ఒక పురుషుడు చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటారు కదా? ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తే ఏమంటారు? వాళ్ళకి కూడా అదే న్యాయం వర్తిస్తుందా?” అని అడుగుతున్నారు.
క్యాబ్ డ్రైవర్ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. కానీ ఆ లక్నో అమ్మాయిని అరెస్ట్ చేయమని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అయితే ఈ విషయంలో అసలు జరిగింది ఏంటో ఎవరికీ తెలియదు. దాంతో ఈ విషయంపై ఇంకా తీర్పు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం “అరెస్ట్ లక్నో గర్ల్” అనే పేరుతో ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే, ప్రియదర్శిని అనే ఆ యువతిపై సెక్షన్స్ పై 394, 427 మీద కేసు ఫైల్ చేశారు అనే వార్త వచ్చింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని ట్రోల్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10
End of Article