Ads
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. పుట్టబోయే బిడ్డతో సంతోషంగా ఉందాం అనుకున్న యువతి ఆశలన్నీ ఆగిపోయాయి. వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని తిపటూరు పట్టణానికి చెందిన చేతన్ ఒక వ్యాపారి. ఆయన భార్య మమత గర్భవతిగా ఉన్నారు. మమత ప్రసవం కోసం శనివారం ఉదయం హాస్పిటల్ కి వెళ్లారు.
Video Advertisement
అక్కడ మమతని అడ్మిట్ చేసుకున్న ఆస్పత్రి సిబ్బంది మమతకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందంటూ బంధువులకి చెప్పారు. మమతని అబ్జర్వేషన్లో ఉంచారు. చివరికి సాధారణ కాన్పు అయ్యే అవకాశం లేదు అని, సిజేరియన్ చేయాలి అని చెప్పి చేతన్ వద్ద సంతకాలు తీసుకున్నారు తర్వాత ఆపరేషన్ థియేటర్ లోకి మమతని తీసుకువెళ్లి చికిత్స ప్రారంభించారు.
మమతకి అప్పటికీ సీరియస్ అవ్వడంతో ఆపరేషన్ సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చి మరణించారు. ఈ విషయం తెలిసిన చేతన్, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మమత చనిపోయారు అని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిజేరియన్ వికటించి రక్తపు వాంతులు చేసుకున్నారు అని తెలిసింది అని అన్నారు. వైద్యులు ముందుగానే ఆపరేషన్ చేసి ఉంటే మమత బతికి ఉండే వారు అని అన్నారు. ఈ విషయంపై తిపటూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
End of Article