Ads
సుడిగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, తర్వాత బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకుకులం అందరికీ చేరువయ్యారు మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ తర్వాత డాన్స్ ప్లస్ ప్రోగ్రాం కి కూడా జడ్జ్ గా వ్యవహరించారు. అంతే కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా ఒక స్పెషల్ పాటలో నటించారు. అయితే ఇప్పుడు మోనాల్ ఇంకొక గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు అనే వార్త వినిపిస్తోంది. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమాలో ఒక హీరోయిన్ గా నటించబోతున్నారట మోనాల్.
Video Advertisement
ఇందులో ఒక హీరోయిన్ గా రమ్యకృష్ణ నటిస్తుండగా, ఇంకొక హీరోయిన్ క్రితి శెట్టి నటిస్తున్నారు. అలాగే నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా ఈ సినిమాలో మరొక హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన కి ప్రీక్వెల్ గా రూపొందుతోంది. దీనికి కూడా మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రల్లో నటించారు. బంగార్రాజు సినిమా, తండ్రి పాత్ర అయిన బంగార్రాజు గురించి, ఆయన జీవితం ఎలా ఉండేది అనే దాని గురించి నడుస్తుందట.
End of Article