Ads
సాధారణంగా పిల్లలపై ఎవరి ప్రభావం అయినా ఎక్కువగా ఉంటుంది అంటే అది తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న పని, వారి పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుంది. కొంత మంది వాటిని పాటించి వారి దారిలో నడిస్తే, కొంత మంది ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళు చేసేది తప్పు అయితే ఆ దారిలో మేము వెళ్ళకూడదు అనుకుని జాగ్రత్త పడతారు.
Video Advertisement
కొంత మంది పెద్ద వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే భయపడి తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లలకైతే ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలా దిక్కుతోచని స్థితిలో ఒక బాలిక ఇటీవల చేసిన పని వింటే కన్నీళ్లు ఆగవు. వివరాల్లోకి వెళితే, జగిత్యాలకు చెందిన 12 సంవత్సరాల ఒక బాలిక పట్టణ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు సమస్య ఏంటి అని అడగగా, ఆ అమ్మాయి ఎస్ఐ నవత దగ్గర తన బాధను చెప్పింది. తన తండ్రి రోజు తాగుతున్నాడు అని, దాని వల్ల ప్రతి రోజూ గొడవలు అవుతున్నాయని, వాటివల్ల తనతో సహా తన కుటుంబ సభ్యులు మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పి కన్నీటి పర్యంతం అయ్యింది.
ఆ బాలిక వేదనని చూసి స్పందించిన ఎస్ఐ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇప్పటినుండి అయినా మారాలి అని చెప్పారు. అంతే కాకుండా ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా కూడా 100 కి డయల్ చేసి సమాచారం అందిస్తే తను వచ్చి చూసుకుంటాను అని ఎస్ఐ నవత ఆ బాలిక కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
End of Article