Ads
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన. రష్మిక కేవలం తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే, రష్మిక ఇటీవల ఫిలిం కంపానియన్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రష్మిక ని ప్రముఖ క్రిటిక్ అనుపమ చోప్రా ఇంటర్వ్యూ చేశారు. ఇందులో రష్మిక సినిమాలకి, అలాగే నిజ జీవితానికి సంబంధించిన వివిధ ప్రశ్నలను అడిగారు.
Video Advertisement
అయితే ఇంటర్వ్యూలో “రష్మిక, విజయ్ దేవరకొండ కి మధ్య ఉన్న రిలేషన్” గురించి కూడా అడిగారు. దీనిపై రష్మిక మాట్లాడుతూ ఈ విధంగా సమాధానం చెప్పారు. “నేను విజయ్ చాలా మంచి ఫ్రెండ్స్. ఇద్దరం మా కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడే కలిసాం. దాదాపు ఒకటే పరిస్థితులను ఎదుర్కొన్నాం. రెండు సినిమాల్లో కలిసి నటించాం. అలా ఇద్దరం కలిసి చాలా కాలం ట్రావెల్ చేశాం.
దాని వల్ల మేము చాలా క్లోజ్ అయ్యాము. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఏ విషయమైనా మాట్లాడాలి అనుకుంటే గుర్తొచ్చే మొదటి వ్యక్తి విజయ్ దేవరకొండ” అని అన్నారు. అంతే కాకుండా ఇండైరెక్ట్ గా రష్మిక జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ చేయబోయే నెక్స్ట్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో తన మీద వచ్చే ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడారు.
మొదట్లో అవి తనని చాలా ఇబ్బంది పెట్టేవి అని, అవి మామూలుగా ఉంటే పర్లేదు కానీ, కొన్ని తన వ్యక్తిగత జీవితాన్ని పాయింట్ చేస్తూ ఉండేవి అని, దాని వల్ల తను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని, వాటి గురించి సోషల్ మీడియాలో మాట్లాడాను” అని అన్నారు. అప్పుడు తనతో ఉన్న వాళ్ళు ఇలాంటి వాటికి ఎక్కువగా స్పందించకు అని చెప్పారట. దాంతో అప్పటి నుంచి రష్మిక ఈ విషయాలను పట్టించుకోవడం మానేశాను అని చెప్పారు.
watch video :
End of Article