Home Filmy Adda “సర్కారు వారి పాట” గురించి…ఇంపార్టెంట్ విషయం లీక్ చేసిన మహేష్ బాబు..! అదేంటంటే..?

“సర్కారు వారి పాట” గురించి…ఇంపార్టెంట్ విషయం లీక్ చేసిన మహేష్ బాబు..! అదేంటంటే..?

by Mohana Priya

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు.

Keerthy Suresh name in Sarkaru vaari paata

ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఎంతో మంది సినీ, రాజకీయ, అలాగే ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబు కూడా వారందరికీ రిప్లై ఇచ్చారు. అలా కీర్తి సురేష్ కూడా మహేష్ బాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Keerthy Suresh name in Sarkaru vaari paata

మహేష్ బాబు, కీర్తి సురేష్ కి రిప్లై ఇస్తూ “థాంక్యూ, ‘కళావతి’ ” అని అన్నారు. దాంతో చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే, సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ పేరు కళావతి. అలా మహేష్ బాబు ఒక చిన్న అప్డేట్ లీక్ చేసేసారు అన్నమాట. ఇందులో మహేష్ బాబు పాత్ర పేరు ఏంటి అనేది ఇంకా తెలియదు. ఇంక సర్కారు వారి పాట సినిమా విషయానికి వస్తే ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

You may also like