Home Bigg Boss 5 telugu సుడిగాలి సుధీర్ కి స్టార్ హీరో రేంజ్ ఆఫర్..! “బిగ్ బాస్” చరిత్రలోనే మొదటి సారిగా.?

సుడిగాలి సుధీర్ కి స్టార్ హీరో రేంజ్ ఆఫర్..! “బిగ్ బాస్” చరిత్రలోనే మొదటి సారిగా.?

by Mohana Priya

ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా నడిచే ఒకే ఒక్క టాపిక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. ఈ సీజన్ ఆగస్ట్ చివరిలో, లేదా సెప్టెంబర్ మొదట్లో మొదలు కాబోతోంది. సాధారణంగా బిగ్ బాస్ అంటే చాలా మందికి ఆసక్తి ఉండడానికి కారణం, ఇందులో మన ఫేవరెట్ సెలబ్రిటీస్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అనేది చూపిస్తారు. అంతే కాకుండా అలా అంత మంది ఒకే ఇంట్లో ఉంటే, అది కూడా వాళ్ళలో చాలా మందికి ఒకరికి ఒకరు తెలియకపోతే అసలు ఎలా ఉంటారు అనేది కూడా తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది.

sudheer missing in atto attammkuturo

అయితే, ఇదిలా ఉండగా సుడిగాలి సుధీర్ కి మా టీవీ యాజమాన్యం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే, సుడిగాలి సుధీర్ ని బిగ్ బాస్ షోలో పాల్గొనమని యాజమాన్యం అడిగారట. అందుకు భారీ మొత్తాన్ని కూడా రెమ్యూనరేషన్ గా ఇవ్వాలి అనుకుంటున్నట్లు సమాచారం. భారీ మొత్తం అంటే ఏదో 10 లక్షలు, 50 లక్షలు కాదు ఏకంగా 4.50 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ఆఫర్ చేశారు అని సమాచారం.

బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత మొత్తాన్ని ఆఫర్ చేయడం ఇదే మొదటిసారి. అయితే, రెండవ సీజన్ హోస్ట్ గా చేసిన నాని ఇంతే మొత్తాన్ని తీసుకున్నారు. దాంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది. కొంత మంది, “ఒక వేళ ఇదే నిజమైతే సుడిగాలి సుధీర్ ని బిగ్ బాస్ లో చూడొచ్చు” అని అనుకుంటూ ఉండగా,  కొంత మంది మాత్రం ఇంత భారీ మొత్తం ఆఫర్ చేశారు అనే విషయం కొంచెం నమ్మశక్యంగా లేదు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

You may also like