Home Filmy Adda సమంత, తమన్నా లాగే…”రష్మిక” తో కూడా “సుకుమార్” ఈ సెంటిమెంట్ ఫాలో అవుతారా.?

సమంత, తమన్నా లాగే…”రష్మిక” తో కూడా “సుకుమార్” ఈ సెంటిమెంట్ ఫాలో అవుతారా.?

by Megha Varna

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.

10 pushpa

దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మొదటి పాట కూడా ఇవాళ విడుదల అయ్యింది. అయితే, ఒక డైరెక్టర్ అన్న తర్వాత ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక సిమిలారిటీ ఉంటుంది. సుకుమార్ విషయంలో కూడా ఆయన సినిమాల్లో కొన్ని ఒకేలా ఉంటాయి.

Sukumar heroine name similarity

ఇదే పుష్ప సినిమాలో కూడా రిపీట్ అవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వివరాల్లోకి వెళితే, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాలో హీరోయిన్ పేరు సుబ్బలక్ష్మి, అలాగే 100% లవ్ లో తమన్నా పేరు మహాలక్ష్మి, రంగస్థలం సినిమాలో సమంత పేరు రామలక్ష్మి, ఇప్పుడు సినిమాలో రష్మిక మందన పేరు కూడా లక్ష్మి పేరు వచ్చేలాగా వస్తుందా? అనే ప్రశ్న అందరిలో మొదలయ్యింది. ఇంతకీ పుష్ప సినిమాలో రష్మిక పేరు ఏంటో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

You may also like