Home News Karthika deepam: మోనిత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.! వైరల్ అవుతున్న కొత్త ప్రోమో.!

Karthika deepam: మోనిత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.! వైరల్ అవుతున్న కొత్త ప్రోమో.!

by Mohana Priya

కార్తీకదీపం సీరియల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం టాప్ సీరియల్ ఏది అంటే అందరూ ఆలోచించకుండా చెప్పే సమాధానం కార్తీకదీపం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ గా నిలిచింది. ఒక వేళ సీరియల్స్ లో కూడా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బస్టర్ కేటగిరీ లోకి వస్తుంది.karthika deepam monitha

అయితే, సీరియల్ నుండి శోభా శెట్టి తప్పుకుంటున్నారు అనే వార్త కొంత కాలం నుండి వైరల్ అవుతోంది. ఇవన్నీ తప్పు అని కొట్టిపారేసే లాగా సీరియల్ కమింగ్ అప్ లో కొత్త ప్రోమో ఒకటి విడుదల చేశారు సీరియల్ బృందం. ఇందులో ఒక మహిళని వెనక వైపు నుండి చూపిస్తున్నారు.Reason behind Shobha Shetty not appearing in Karthika deepam serial

ఆవిడ కళ్ళు మనకి కనిపిస్తాయి. ఈ ప్రోమో చూసిన వాళ్ళందరికీ ఆ మహిళ మరెవరో కాదు మోనిత అలియాస్ శోభా శెట్టి అని అర్థమైపోతుంది. దాంతో శోభా శెట్టి సీరియల్ వదలలేదు కంటిన్యూ అవుతున్నారు అని ఫ్యాన్స్ చాలా ఆనంద పడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like