Home Filmy Adda అది రౌడీ హీరో అంటే..! లైగర్ సినిమాలో ఈ “ఇంటర్నేషనల్ సెలబ్రిటీ” కేమియో..?

అది రౌడీ హీరో అంటే..! లైగర్ సినిమాలో ఈ “ఇంటర్నేషనల్ సెలబ్రిటీ” కేమియో..?

by Mohana Priya

విజయ్ దేవరకొండకి కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మాత్రమే కాదు మిగిలిన ఇండస్ట్రీస్ లో కూడా బాగా క్రేజ్ ఉంది. చాలా సార్లు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వారికి ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. అలాగే విజయ్ దేవరకొండ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే తనకు ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు అర్థం అయిపోతుంది.vijay devarakonda

విజయ్ దేవరకొండ నోటా సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు కూడా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయ్యాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నారు.2 vijay devara konda

ఇది పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ఈ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇందులో ఒక ఇంటర్నేషనల్ సెలబ్రిటీ గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించబోతున్నారట.

క్లైమాక్స్ లో ప్రముఖ అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపిస్తారు అని సమాచారం. ప్రీ క్లైమాక్స్ పార్ట్ అనేది సినిమాకి ఒక మేజర్ హైలైట్ గా ఉండబోతోందట. ఈ వార్త ఆల్మోస్ట్ కన్ఫామ్ అని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, విజయ్ దేవరకొండ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతుంది.

You may also like