Home Filmy Adda మీ నవ్వు చూసాక నా పళ్ళ గురించి బాధపడటం మానేశా.? వైరల్ అవుతున్న బిగిల్ పాప స్టోరీ.!

మీ నవ్వు చూసాక నా పళ్ళ గురించి బాధపడటం మానేశా.? వైరల్ అవుతున్న బిగిల్ పాప స్టోరీ.!

by Mohana Priya

ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు అమృత అయ్యర్. అంతకుముందు తలపతి విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. అయితే, అమృత అయ్యర్ ఇటీవల తనకు వచ్చిన ఒక మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.Heroine Amrita Iyer bag went viral on social media

ఒక అభిమాని అమృతకి ఈ విధంగా మెసేజ్ చేశారు. “హాయ్ అక్కా. నేను మీకు చాలా పెద్ద అభిమానిని. నాకు మీ పళ్ళు, నవ్వు అంటే కూడా చాలా ఇష్టం. మీరు చాలా అందంగా ఉంటారు. నా పళ్ళు కూడా అచ్చం మీ పళ్ళ లాగానే ఉంటాయి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత నా పళ్ళ గురించి నేను పడుతున్న భయం మొత్తాన్ని వదిలేసాను. మీరంటే నాకు చాలా గౌరవం ఏర్పడింది. మీ భవిష్యత్తు చాలా బాగుండాలి అని నేను ఆశిస్తున్నాను” అని రాశారు.

ఈ చాట్ స్క్రీన్ షాట్ అమృత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసి “దిస్ ఇస్ సో స్వీట్. థాంక్యూ సో మచ్” అని రాశారు. అమృత ఇటీవల విడుదలైన రెడ్ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. ప్రస్తుతం అమృత రెండు తమిళ సినిమాల్లో, అలాగే గ్రామాయణ అనే ఒక కన్నడ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కన్నడలో అమృత మొదటి సినిమా. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

You may also like