Ads
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో జగపతి బాబు విలన్ పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఒక రకంగా జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అప్పటివరకూ మనం జగపతి బాబుని పాజిటివ్ రోల్ లోనే చూసాం. లెజెండ్ సినిమాలో మొదటిసారిగా జగపతిబాబుని విలన్ గా చూశాం. ఆ తర్వాత పాజిటివ్, నెగిటివ్ అనే తేడా లేకుండా ఎన్నో మంచి పాత్రలు చేస్తూ వస్తున్నారు జగపతిబాబు.
Video Advertisement

అయితే, ఇటీవల ఒక సందర్భంలో జగపతి బాబు లెజెండ్ సినిమాలో తనకు అన్యాయం జరిగింది అంటూ చెప్పారు. సినిమా కథ తనకు చెప్పినప్పుడు ఒక లాగా ఉంది అని, తీసేటప్పుడు మరో లాగా ఉంది అని, సింహం, పులి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పారు అని, కానీ అక్కడ పులి కాదు కదా, కుందేలు లాగా కూడా లేదు అని అన్నారు. ఇంక ఇప్పటి నుంచి తనకి పాత్ర నచ్చితేనే చేస్తాను అని, మిగిలిన వాటితో తనకి ఏమి సంబంధం లేదు అని అన్నారు.
watch video :
End of Article
