ఈ యువతి చేసిన స్కామ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.! పెళ్లి అయిన మూడు రోజులకే.?

ఈ యువతి చేసిన స్కామ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.! పెళ్లి అయిన మూడు రోజులకే.?

by Mohana Priya

Ads

సాధారణంగా పెళ్లి అంటే మనం భారతదేశంలో ఒక విలువ ఇస్తారు. కానీ కొంత మంది మాత్రం ఆ విలువలు అన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం, విశాఖపట్నంలోని గాజువాకకి చెందిన రేణుక అనే యువతికి జగదీష్ తో వివాహం జరిగింది. పెళ్లి అయిన మూడు రోజులకే ఆ యువతి గర్భవతి అని తేలింది. దాంతో జగదీష్ రేణుకని వదిలేశాడు. రేణుక అంతకుముందే శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించింది.

Video Advertisement

అప్పుడే రేణుక గర్భం దాల్చింది. తర్వాత శ్రీనివాస్ వేరే పెళ్ళికి సిద్ధమయ్యాడు. రేణుక ఒక పాపకు జన్మనిచ్చింది. శ్రీనివాస్ ని రేణుక నిలదీయడంతో, శ్రీనివాస్ రేణుక వదిలించుకోవాలి అనుకొని ఒక ప్లాన్ వేసాడు. పాప బాధ్యత తీసుకుంటాను అని అలాగే తనకి కొంత నగదు కూడా ఇస్తాను అని చెప్పి ఇంట్లో చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ పిన్ని కొడుకు అయిన ప్రసాద్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి వివరాలను రేణుకకి ఇచ్చి ప్రసాద్ ని లైన్ లో పెట్టమని అని చెప్పాడు శ్రీనివాస్. ప్రసాద్ తో క్లోజ్ అయ్యి పెద్దలకు తెలియకుండా తనని పెళ్లి చేసుకునేలా చేసింది రేణుక.

ఉద్యోగరీత్యా లక్నోలో ఉంటున్న ప్రసాద్, రేణుకని కాపురానికి లక్నో కి తీసుకెళ్లి ఆమెకి ఎన్నో లక్షల విలువ చేసే బంగారాన్ని కొనిచ్చాడు. కొంతకాలం తర్వాత తనకి జివిఎంసిలో ఉద్యోగం వచ్చిందని చెప్పి విశాఖపట్నం వచ్చి శ్రీనివాస్ తో సెటిల్ అయ్యింది రేణుక. ఈలోగా లాక్ డౌన్ రావడంతో ప్రసాద్ వైజాగ్ కి రాలేకపోయాడు. కానీ తరచుగా రేణుకతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తరచుగా ప్రసాద్ నుండి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది రేణుక.

సర్జరీల పేరుతో దాదాపు 45 లక్షల రూపాయలను ప్రసాద్ నుండి తీసుకుంది రేణుక. అంతే కాకుండా తర్వాత తన తల్లి చనిపోయింది అంటూ నమ్మించింది. ఇదంతా మాత్రమే కాకుండా ప్రసాద్ కి తెలియకుండా సాయి అనే ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న యువకుడిని కూడా పెళ్లి చేసుకుంది రేణుక. చివరికి రేణుక గురించి తెలుసుకున్న ప్రసాద్ గాజువాక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


End of Article

You may also like