Home Filmy Adda శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్స్ కి “హీరోయిన్” అటెండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా.?

శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్స్ కి “హీరోయిన్” అటెండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా.?

by Mohana Priya

సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు. అలాగే సీనియర్ నటుడు నరేష్ గారు ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి పలాస సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరుణ కుమార్ దర్శకత్వం వహించారు, ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్,టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో నటించిన ఆనంది మన తెలుగు అమ్మాయి.sridevi soda center actress anandhi

వరంగల్ కి చెందిన ఆనంది ఆట ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. ఆనంది అసలు పేరు రక్షిత. 2012 లో వచ్చిన ఈ రోజుల్లో సినిమాతో మొదటిసారిగా బిగ్ స్క్రీన్ పై కనిపించారు. తర్వాత అదే సంవత్సరంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాలో నటించారు. ఆ తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో, వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. తర్వాత ఎన్నో తమిళ్ సినిమాల్లో నటించారు.zombie reddy fame anandhi

జనవరి 7వ తేదీ 2021 లో వరంగల్ లో సోక్రటీస్ తో ఆనంది వివాహం జరిగింది. శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషనల్ ఈవెంట్ కి ఆనంది హాజరు కాలేదు. దీనికి కారణం ఏంటి అనేది సినిమా బృందం కూడా ఏ ఒక్క ఈవెంట్ లో చెప్పలేదు. కానీ ఆనంది ప్రమోషన్స్ కి హాజరు అవ్వకపోవడానికి కారణం ఇప్పుడు బయటికి వచ్చింది. సమయం కథనం ప్రకారం, ఆనంది గర్భవతిగా ఉన్నారు. ప్రస్తుతం ఆనంది ఆరు నెలల ప్రెగ్నెంట్ అవ్వడంతో ప్రమోషన్స్ కి రాలేదట. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది.

You may also like