Home Filmy Adda చిన్నప్పుడు “రాజశేఖర్” కి కూతురుగా నటించి…పెద్దయ్యాక ఆయనతోనే రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.?

చిన్నప్పుడు “రాజశేఖర్” కి కూతురుగా నటించి…పెద్దయ్యాక ఆయనతోనే రొమాన్స్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.?

by Mohana Priya

ఎన్నో సంవత్సరాలుగా హీరోగా మనల్ని అలరిస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు రాజశేఖర్. యాక్షన్, సెంటిమెంట్, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల సినిమాల్లో తనదైన స్టైల్ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1984 లో ప్రముఖ దర్శకుడు భారతీ రాజా గారి దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా పుదుమై పెన్ తో సినిమా కెరీర్ మొదలు పెట్టారు రాజశేఖర్.actress who acted as daughter and heroine with rajasekhar

1985 లో వచ్చిన వందేమాతరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత ఈ ప్రశ్నకు బదులేది, దొర బిడ్డ, చల్లని రామయ్య చక్కని సీతమ్మ, తలంబ్రాలు, రేపటి పౌరులు, అరుణకిరణం, కాష్మోరా ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. మధ్యలో కొన్ని సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. 2017 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన పిఎస్వి గరుడ వేగ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు రాజశేఖర్.actress who acted as daughter and heroine with rajasekhar

2019 లో వచ్చిన కల్కి సినిమాలో రాజశేఖర్ చివరిగా కనిపించారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ తో బిజీగా ఉన్నారు. రాజశేఖర్ తో నటించిన ఒక నటి తర్వాత ఆయనతోనే హీరోయిన్ గా కూడా నటించారు. 1989 లో రాజశేఖర్ సుహాసిని హీరో, హీరోయిన్లుగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా మమతల కోవెల. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురిగా ప్రముఖ నటి రాశి నటించారు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన నేటి గాంధీ సినిమాలో రాజశేఖర్ తో హీరోయిన్ గా నటించారు రాశి. కేవలం రాజశేఖర్ తో మాత్రమే కాదు, బాలకృష్ణ, శ్రీకాంత్ ఇంకా ఎంతో మంది అగ్ర హీరోలతో నటించి రాశి తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

You may also like