Home Bigg Boss 5 telugu “అందుకే బిగ్‌బాస్ కి వచ్చాను.!” అంటూ అసలు విషయం బయటపెట్టిన ఉమా దేవి.! (వీడియో)

“అందుకే బిగ్‌బాస్ కి వచ్చాను.!” అంటూ అసలు విషయం బయటపెట్టిన ఉమా దేవి.! (వీడియో)

by Mohana Priya

ఈ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో ఎలిమినేషన్స్ లో భాగంగా ఉమా దేవి హౌస్ నుండి బయటకు వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ అరియానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ లో ఉమా దేవి కొన్ని విషయాలను చెప్పారు. ఈ విషయాల గురించి మనం రోజు టీవీలో చూసేటప్పుడు ఎక్కడా ప్రస్తావించరు. సిరికి, షణ్ముఖ్ కి పడదు అని అంటారు కానీ వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అని, షణ్ముఖ్ తన గేమ్ తను ఆడడు అని చెప్పారు ఉమా దేవి.

g Boss Telugu 5 uma speaks about the show

ఫ్రెండ్స్ అయితే బయట ఉండాలి కానీ షోలో ఏంటి? ఒకవేళ అలాగే ఆడాలి అనుకుంటే ఇంట్లో ఆడుకోవచ్చు కదా? కుటుంబాలని వదిలేసి బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చారు? అని అన్నారు. షణ్ముఖ్ బయట యూట్యూబ్ స్టార్ ఏమో కానీ లోపల మాత్రం ఎప్పుడు సైలెంట్ గా ఉంటాడు అని అన్నారు. అంతే కాకుండా లహరి గురించి మాట్లాడుతూ ఆవిడ హౌస్ కి ఫిట్ అవ్వరు అని చెప్పారు. అనీ మాస్టర్ చాలా కన్నింగ్ అని కూడా చెప్పారు ఉమా దేవి. లహరి చాలా వీక్ అని, లహరి అంటే ఏంటో ఎవరికీ తెలియదు అన్నారు. అలాగే “విన్నర్ ఎవరు అవుతారు?” అని అరియానా అడగగా, “సన్నీ” అని చెప్పారు ఉమా దేవి.

Bigg Boss Telugu 5 uma speaks about the show

సరయు చాలా మంచి కంటెస్టెంట్ అంటూ సరయు గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు. వీరు మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది కంటెస్టెంట్స్ గురించి కూడా ఉమా దేవి మాట్లాడారు. ఉమా దేవి తాను బిగ్ బాస్ కి రావడానికి గల కారణాలు కూడా చెప్పారు. అందులో ఒక కారణం తన పిల్లల కోసం అని చెప్పారు ఉమా దేవి. తన పిల్లలు తనని ఈ ప్లాట్‌ఫామ్ మీద చూడాలి అని అనుకుంటున్నారు కాబట్టే తను ఈ షోకి వచ్చినట్టు ఉమాదేవి చెప్పారు. కానీ గేమ్ లో తానే తప్పుగా ఆడాను అని, అలా ఆడకుండా ఉండి ఉంటే కచ్చితంగా లోపల ఉండేదాన్ని అని అన్నారు. అలాగే తన పిల్లలు తన ఫైనల్స్ కి వెళ్ళినా, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయినా కూడా ఫీల్ అవ్వరు అని అన్నారు.

watch video :

You may also like