Home Filmy Adda చై-సామ్ గొడవల గురించి వాళ్ళ పెళ్ళికి ముందే చెప్పిన వేణు స్వామి.! సమంత ఆరోజు పుట్టడంతో.?

చై-సామ్ గొడవల గురించి వాళ్ళ పెళ్ళికి ముందే చెప్పిన వేణు స్వామి.! సమంత ఆరోజు పుట్టడంతో.?

by Mohana Priya

సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా నాగార్జున బర్త్ డే పార్టీకి సమంత హాజరు అవ్వకపోవడం, సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ కూడా పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి.

venu swamy predicts about naga chaitanya samantha divorce

ఈ విషయంపై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా సమంత నాగ చైతన్య మధ్య విభేదాల గురించి మాట్లాడారు. వారిద్దరి వైవాహిక జీవితం గురించి మూడు సంవత్సరాల క్రితమే మాట్లాడాను అని చెప్పారు. వేణు స్వామి అంతకుముందు మాట్లాడుతూ అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది అని తను చెప్పినట్టు, తర్వాత అదే జరిగినట్టు అన్నారు.

https://youtu.be/cYA3X0dtuLo

 

అదే విధంగా నాగ చైతన్య, సమంత మధ్య కూడా పెళ్లి అయిన తర్వాత గొడవలు వస్తాయి అని కూడా వేణు స్వామి చెప్పారట. అందుకు కారణం సమంత అమావాస్య నాడు పుట్టారు. దాని వల్ల నాగ చైతన్యకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనే విషయం గురించి వేణు స్వామి చెప్పారు. సినిమాల పరంగా ఇద్దరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కెరియర్లో మంచి స్థాయిలో ఉంటారు. కానీ వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు కలుగుతాయి అని వేణు స్వామి ముందే చెప్పారు. ఇప్పుడు ఈ విషయం చర్చలో నిలవడంతో వేణు స్వామి మళ్ళీ తాను అంతకుముందు చెప్పిన విషయం గురించి మాట్లాడారు.

watch video : 

https://youtu.be/PxRWZ-9H3lE

You may also like