Ads
రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది.
Video Advertisement
ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న లవ్ స్టోరీ సినిమాపై వివాదాలు కూడా అంతే ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఒక మెసేజ్ కూడా అందించారు శేఖర్ కమ్ముల. అయితే, ఈ సినిమాలో ఒక సన్నివేశంపై హిందూ సంఘాలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సమయం కథనం ప్రకారం, లవ్ స్టోరీ సినిమాలో ఒక సీన్ లో పూజ గదిలో మహాలక్ష్మి ఫోటో పక్కనే జీసస్ ఫోటో ఉన్నట్టు చూపించారు.
సినిమా కోసం శేఖర్ కమ్ముల ఈ రకమైన సీన్ చూపించడానికి ప్రయత్నించినా కూడా హిందూ సంఘాలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “హిందూ పూజ గదిలో జీసస్ ఫోటో ఎలా పెడతారు?” అని అన్నారు. “ఇదే విధంగా మసీదులో చేస్తే ఊరుకుంటారా?” అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హిందూ దేవుళ్ళని కించపరచడం ఎక్కువ అయిపోయింది అని, అలాంటి సన్నివేశాలను వెంటనే తొలగించాలని హిందూ సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
End of Article