Home Bigg Boss 5 telugu “తప్పుని క్షమిస్తారు…కానీ వరసగా తప్పులు చేస్తే.?” యాంకర్ రవి రిక్వెస్ట్ పై నటి శ్రీ సుధ కామెంట్ వైరల్.!

“తప్పుని క్షమిస్తారు…కానీ వరసగా తప్పులు చేస్తే.?” యాంకర్ రవి రిక్వెస్ట్ పై నటి శ్రీ సుధ కామెంట్ వైరల్.!

by Mohana Priya

బిగ్‌బాస్ తెలుగు-5 లో గతవారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ప్రియ, లహరి, రవికి మధ్య మాటా మాటా పెరిగి గొడవ అయ్యింది. ఇందులో ప్రియ, లహరిని, “నువ్వు అబ్బాయిలతోనే ఎక్కువగా మాట్లాడతావు” అని ఉద్దేశం వచ్చేలాగా మాట్లాడారు. అలాగే రవి, లహరి బాత్ రూమ్ లో హగ్  చేసుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.

ప్రియ, “లహరి ఇంతమంది పెళ్ళికాని అబ్బాయిలు ఉండగా, తను నాతోనే ఎందుకు క్లోజ్ గా ఉంటోంది? బహుశా యాంకరింగ్ అవకాశాల కోసం ఏమో?” అని రవి తనతో అన్నారు అని లహరితో చెప్పారు. కానీ అప్పుడు రవి తాను అలాంటి మాటలు అసలు మాట్లాడలేదు అని చెప్పారు. వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున వీడియో చూపించారు. ఇందులో రవి ఆ మాటలు అన్నట్టు మనం చూడవచ్చు. ఈ విషయం తెలిసిన లహరి రవికి, “యాంకరింగ్ కోసం నీతో క్లోజ్ గా ఉంటున్నాను అనడం తప్పు” అని చెప్పారు.actress sri sudha comments on anchor ravi apology post

లహరి గతవారం షో నుండి ఎలిమినేట్ అయ్యారు. నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో రవి మాట్లాడుతూ లహరికి, లహరి తల్లికి, అలాగే ప్రియకి క్షమాపణలు చెప్పారు. ఈ విషయంపై ప్రముఖ నటి, అర్జున్ రెడ్డి ఫేమ్ శ్రీ సుధ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రవి ఫేస్ బుక్ పేజీలో రవి క్షమాపణలు అడుగుతున్న వీడియోని షేర్ చేశారు. అందుకు శ్రీ సుధ, “తప్పుని క్షమిస్తారు. కానీ ఇలా రిపీటెడ్ గా తప్పులు చేస్తే క్షమించలేరు” అని రాశారు. ఈ విషయంపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

You may also like