Home Filmy Adda “సంసారంలో ఇవన్నీ సహజం…అహంకారానికి పోకుండా సర్దుకుపోవాలి.!” అంటూ నాగ చైతన్య, సమంత విడాకులపై శ్రీ రెడ్డి కామెంట్స్.!

“సంసారంలో ఇవన్నీ సహజం…అహంకారానికి పోకుండా సర్దుకుపోవాలి.!” అంటూ నాగ చైతన్య, సమంత విడాకులపై శ్రీ రెడ్డి కామెంట్స్.!

by Mohana Priya

Ads

సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి.

Video Advertisement

ఇవి మాత్రమే కాకుండా నాగార్జున బర్త్ డే పార్టీకి సమంత హాజరు అవ్వకపోవడం, సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ కూడా పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందించారు. “తమిళనాడులో అంతా సమంతని తిడుతున్నారు అని, ఎందుకంటే అంత మంచి కుటుంబంతో ఉన్న బంధం తెంచుకుంటున్నారు అని, అది కరెక్ట్ కాదు అని అంటున్నారు అని” శ్రీ రెడ్డి అన్నారు. సంసారంలో ఇవన్నీ సహజమే అహంకారానికి పోకుండా సర్దుకుపోవాలి అని అన్నారు.

“అలాగే సమంత భారతదేశ స్త్రీ కాబట్టి, అందుకు తగ్గట్టే నడుచుకోవాలి, డ్రెస్ సెన్స్ కూడా మార్చుకోవాలి” అని చెప్పారు. “ఇంగ్లీష్ పేరు పెట్టుకున్నంత మాత్రాన హాలీవుడ్ హీరోయిన్ అయిపోరు కదా? భారతదేశ పద్ధతులకు తగ్గట్టే ఉండాలి” అని అన్నారు. ఏది ఏమైనా సమంత, నాగ చైతన్యల గురించి చాలా రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. అందులో నిజం ఎంతో తెలియాలి అంటే…స్వయంగా వారే స్పష్టత ఇచ్చే అంత వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ఇలాంటి గాసిప్ లు ఎన్నో వస్తూనే ఉంటాయి అనుకుంటా.

watch video : 


End of Article

You may also like