Ads
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం సినిమా చుట్టూ జరుగుతున్న విషయాల గురించి తెలిసిందే. టికెట్ రేట్స్, థియేటర్స్ విషయం లో ఇటీవలే పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం యొక్క తీరుని తప్పు బడుతూ ఈ మధ్య జరిగిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటు చేసుకున్న పరిణామాలు, అటు తరువాత ఏపీ లో జరుగుతున్న సంఘటనలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Video Advertisement
ఇక అటు తరువాత ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరు సపోర్ట్ చేయలేదు పవన్ కి కేవలం ఇద్దరు ముగ్గురు చిన్న హీరోలు తప్ప ఎవరు పెదవి విప్పలేదు.. అంతే కాకుండా పవన్ తన వ్యక్తిగత అభిప్రాయాలకి తమకి సంబంధంలేదంటూ ఒక ప్రకటన కూడా చేసింది ఫిలిం ఛాంబర్. అంతే కాదు సినిమా రంగం సక్రమంగా నడవాలి అంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పూర్తి సహకారం ఉండాలంటూ చెప్పారు.
ఈ సంఘటనల నడుమ ఇటీవలే విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ మీట్ ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ పెద్దలు కూడా వచ్చారు. కానీ ఎక్కడ కూడా పవన్ మాట్లాడిన అంశాల గురించి చెప్పలేదు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్ గా వచ్చారు కొవిడ్ మహమ్మారితో ఇరు రాష్ట్రాలు పోరాడిన తీరును అయన పొగిడారు.
అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సినిమాని ఎంతగానో ఆదరిస్తారని దానికి ఇరు ప్రభత్వాల సహాయ సహకారాలు కావాలంటూ విజ్ఞప్తి చేసారు. పవన్ లేవనెత్తిన అంశాలను ఎక్కడ కూడా నాగ్ ప్రస్తావనికి తీసుకురాలేదు. తెలంగాణ తో పోలిస్తే ఏపీ లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండెనని అందుకే ఇప్పటికి కూడా అన్ని థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదని అన్నారు
End of Article