Home Filmy Adda Suma : సుమపై కేస్ పెడతానన్న రాఘవేంద్ర రావు.! కారణం ఏంటంటే.?

Suma : సుమపై కేస్ పెడతానన్న రాఘవేంద్ర రావు.! కారణం ఏంటంటే.?

by Mohana Priya

Ads

లెజెండరీ దర్శకుడు రాఘవేంద్ర రావు గారు, యాంకర్ సుమపై కేస్ పెడతాను అన్నారు. ఇది ఏదో సీరియస్ గా కాదు. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న పెళ్లి సందడి సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యింది. ఈ సినిమాలో నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Video Advertisement

కొన్ని సంవత్సరాల క్రితం శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ ఇది. ఈ సినిమా బృందం అంతా సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాంకి అతిథులుగా రాబోతున్నారు. ఇందులో భాగంగా రాఘవేంద్ర రావు గారు సుమపై సెటైర్లు వేశారు. “నీ మీద కేస్ పెడతాను” అన్నారు.

అందుకు సుమ, “ఎందుకు సార్?” అని అనగా, అప్పుడు రాఘవేంద్ర రావు గారు, “నువ్వు డేట్స్ ఇస్తావ్ ఏమో అని వెయిట్ చేస్తున్నాను. కానీ ఇప్పటివరకు నువ్వు నాతో సినిమా చేయలేదు. నీకోసం ఒక గుమ్మడికాయ కూడా రెడీగా ఉంచాను” అని అన్నారు. ప్రోమో చివరిలో, “ఈ ప్రోగ్రాం అంతా అబద్ధం. డబ్బులు ఇస్తానన్నారు. డబ్బులు లేవు” అని కోపంతో రాఘవేంద్ర రావు గారు, సినిమా బృందం అంతా సెట్ నుండి వెళ్ళిపోతున్నారు.

watch video :


End of Article

You may also like