Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Video Advertisement
అయితే పుష్ప సినిమా బృందం ఇవాళ రష్మిక మందన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో రష్మిక, శ్రీ వల్లి అనే పాత్రను పోషిస్తున్నారు. పోస్టర్ లో రష్మిక చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అద్దంలో చూస్తూ రష్మిక రెడీ అవుతున్నట్టు ఈ పోస్టర్ లో మనం చూడొచ్చు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా మేకోవర్ అయ్యారు. చిత్తూరు యాసలో మాట్లాడడం కూడా నేర్చుకున్నారు. పుష్ప సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతోంది.
End of Article