Ads
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి దేవా కట్టా దర్శకత్వం వహించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా, రమ్య కృష్ణ జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా అంతా పంజా అభిరామ్ అనే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ చుట్టూ తిరుగుతుంది.
Video Advertisement
అభిరామ్ అనే ఒక స్టూడెంట్ కలెక్టర్ గా ఎందుకు మారాడు? మారిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాడు? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం జరుగుతుంది. ఇందులో విశాఖ వాణి అనే ఒక రాజకీయ నాయకురాలిగా రమ్య కృష్ణ నటించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం రమ్య కృష్ణ కొత్త ఏమీ కాదు. ఈ సినిమాలో కూడా తన స్టైల్ లో చాలా బాగా నటించారు రమ్య కృష్ణ. రిపబ్లిక్ సినిమాలో రెండు సీన్స్ పై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అందులో ఒక సీన్ లో సాయి ధరమ్ తేజ్ బండిపై వెళ్తూ వెళ్తూ స్కిడ్ అయ్యి కింద పడిపోతారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ కి గాయాలు అయిన సంగతి మనందరికీ తెలుసు. “అసలు ఇలాంటి షాట్ సినిమాలో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ సీన్ చిత్రీకరించాలి అనే ఆలోచన దర్శకుడికి ఎలా వచ్చింది?” అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఇంకొక సీన్ క్లైమాక్స్. సాధారణంగా ఇలాంటి క్లైమాక్స్ మన తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అందులోనూ కమర్షియల్ హీరోల సినిమాల్లో అయితే ఇలాంటి క్లైమాక్స్ జీర్ణించుకోవడం కష్టమే.
దాంతో క్లైమాక్స్ చూసిన ప్రేక్షకులు కొంత మంది, “క్లైమాక్స్ ఏంటి ఇలా ఉంది?” అని అంటుంటే, ఇంకొంత మంది మాత్రం, “ఇలాంటి క్లైమాక్స్ తీసినందుకు దర్శకుడు దేవా కట్టా అలాగే సాయి ధరమ్ తేజ్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి” అని అంటున్నారు. “ఎందుకంటే నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా కాబట్టి ఎటువంటి మార్పులు కానీ, కమర్షియల్ అంశాలు కానీ జోడించకుండా చాలా స్ట్రైట్ గా కేవలం ఒకటే పాయింట్ మీద సినిమా మొత్తం నడిపించారు. ఇలాంటి సినిమాలు చాలా రావడం చాలా అరుదు” అని అంటున్నారు.
End of Article