Ads
సమంత, నాగ చైతన్య గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య, సమంత వారిద్దరి విషయాన్ని ప్రకటించారు.
Video Advertisement
విడాకుల నేపథ్యంలో సమంత భరణం తీసుకోబోతున్నారు అనే వార్త గత కొద్ది రోజుల నుండి చాలా బలంగా వినిపిస్తోంది. దీనిపై ఎంతోమంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొంత మంది, “సమంత 200 కోట్లు భరణం తీసుకుంటోంది” అంటే, ఇంకొంతమంది “300 కోట్లు” అని, మరికొంతమంది ఏమో “350 కోట్లు” అని అన్నారు. చివరగా అక్కినేని కుటుంబం సమంతకి 50 కోట్ల నగదుని ఇస్తున్నారు అనే వార్త వచ్చింది. కానీ మళ్ళీ 200 కోట్లు తీసుకుంటున్నారు అనే వార్త వెలుగులోకి వచ్చింది.
ఈ విషయంపై సమంత మాత్రం నిర్ణయం తీసుకున్నారు. డిటి నెక్స్ట్ కథనం ప్రకారం సమంతకి 200 కోట్ల రూపాయలు భరణంగా ఇవ్వడానికి అక్కినేని కుటుంబం నిర్ణయించుకుంది. కానీ సమంత అందుకు ఒప్పుకోలేదట. “నాకు కూడా ఆత్మాభిమానం ఉంది. నేను నా కాళ్ళపై నేను నిలబడినదాన్ని. నాకు భరణం అవసరం లేదు” అని చెప్పారట. వీరిద్దరి మధ్య ఉన్న గొడవలని పరిష్కరించడానికి నాగార్జునతో పాటు ఇంకా ఎంతోమంది ప్రయత్నించారు.
ఎంతమంది ప్రయత్నించినా కూడా వారిద్దరూ వెనక్కి తగ్గలేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం సమంత, నాగ చైతన్య కలిసి ఉంటున్న అపార్ట్మెంట్ కూడా సమంత సొంత డబ్బులతో తీసుకున్నారు అనే వార్త వినిపిస్తోంది. ఈ కారణంగానే సమంత అదే ఇంట్లో ఉంటున్నారు. కానీ నాగ చైతన్య మాత్రం అక్కినేని కుటుంబంతో పాటు కలిసి ఉంటున్నారు.
End of Article