Ads
సమంత, నాగ చైతన్య గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య, సమంత వారిద్దరి విషయాన్ని ప్రకటించారు.
Video Advertisement
ఇందులో నాగ చైతన్య ఈ విధంగా రాశారు. “మా ఆత్మీయులకి, చాలా చర్చ తర్వాత నేను ఇంకా సామ్ భార్యాభర్తలు అనే బంధం నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా కెరియర్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. పదేళ్లకు పైగా మా స్నేహం ఉంది. అందుకు మేము ఎంతో అదృష్టవంతులం. మా ఇద్దరి మధ్య ఈ ప్రత్యేకమైన బంధం అలానే ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. మేము మా ఫ్యాన్స్, ఆత్మీయులను, అలాగే మీడియా వాళ్ళని ఇలాంటి పరిస్థితులలో మాకు సహకరించాలని, అలాగే మేము ఇదంతా మర్చిపోయి ముందుకు వెళ్లడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం.” ఇదే విషయాన్ని సమంత కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
వీరిద్దరూ మొదట ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కూడా నటించారు. మనం సినిమా చేస్తున్నప్పుడు వీరిద్దరూ ఒకరి నొకరు ఇష్టపడ్డారు. 2013 నుండి వీరి ప్రేమ మొదలయ్యింది. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో సమంత తాను సింగిల్ గా లేను అని ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను అని చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో సమయం వచ్చినప్పుడు చెప్తాను అని కూడా చాలా సార్లు చెప్పారు. 2016లో వీరిద్దరి రిలేషన్ షిప్ విషయం అందరి ముందుకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఎంగేజ్మెంట్ అయ్యింది. 2017లో గోవాలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎవరు ఊహించని విధంగా నాగ చైతన్య, సమంత ఈవార్త ప్రకటించడంతో ఫ్యాన్స్ అందరూ షాక్ కి గురయ్యారు.
End of Article