“సమంత మాతో గడిపిన క్షణాలని మేము ఎప్పటికీ మర్చిపోలేము.!” అంటూ నాగార్జున ఎమోషనల్ పోస్ట్.!

“సమంత మాతో గడిపిన క్షణాలని మేము ఎప్పటికీ మర్చిపోలేము.!” అంటూ నాగార్జున ఎమోషనల్ పోస్ట్.!

by Mohana Priya

Ads

సమంత, నాగ చైతన్య గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీసింది. సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య వారిద్దరి విషయాన్ని ప్రకటించారు.Reason behind Nagarjuna not attending the press meet of Telugu Bigg Boss 5

Video Advertisement

వీరిద్దరూ మొదట ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కూడా నటించారు. మనం సినిమా చేస్తున్నప్పుడు వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2013 నుండి వీరి ప్రేమ మొదలయ్యింది. 2016లో వీరిద్దరి రిలేషన్ షిప్ విషయం అందరి ముందుకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఎంగేజ్మెంట్ అయ్యింది. 2017లో గోవాలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఈ విషయంపై అక్కినేని నాగార్జున స్పందించారు. ట్విట్టర్ వేదికగా నాగార్జున ఈ విధంగా రాశారు. “చాలా భారమైన మనసుతో నేను ఇది చెప్పాల్సి వస్తోంది నాగచైతన్య సమంత కి మధ్య జరిగిన ఈ విషయం చాలా బాధాకరమైనది. ఒక భార్యకి, భర్తకి మధ్య ఏ విషయం జరిగినా కూడా అది వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. సమంత, నాగ చైతన్య నాకు చాలా ఇష్టం. సమంతతో మేము గడిపిన ప్రతిక్షణం మా కుటుంబం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. సమంత నాకు ఎప్పటికీ ఆత్మీయురాలిలాగానే ఉంటుంది. వారిద్దరికీ శక్తిని ఇవ్వాలి అని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను.” అని నాగార్జున రాశారు.


End of Article

You may also like