Home Filmy Adda “అదే కావాలి అని నాగ చైతన్య పట్టుపట్టాడు.!” అంటూ మురళీ మోహన్ కామెంట్స్.! (వీడియో)

“అదే కావాలి అని నాగ చైతన్య పట్టుపట్టాడు.!” అంటూ మురళీ మోహన్ కామెంట్స్.! (వీడియో)

by Mohana Priya

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న ఒకే ఒక్క టాపిక్ సమంత, నాగ చైతన్య విడాకులు. “ఇంత మంచి జంట విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?” అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రముఖ నటులు, రాజకీయవేత్త మురళీ మోహన్ గారు ఒక సందర్భంలో నాగ చైతన్య, సమంత ఉన్న అపార్ట్మెంట్ గురించి మాట్లాడారు. మురళీ మోహన్ గారి జయభేరి ఆరంజ్ కౌంటీ అపార్ట్మెంట్ లో నాగ చైతన్య, సమంత నివాసం ఉన్నారు.

murali mohan about naga chaitanya apartment

ఈ అపార్ట్మెంట్ కొనుక్కోవడం వెనకాల ఉన్న కథని ఒక ఇంటర్వ్యూలో మురళీ మోహన్ గారు వివరించారు. నాగ చైతన్య, సమంత అప్పటివరకు చాలా అపార్ట్మెంట్స్ చూసి ఉన్నారు. నాగ చైతన్యకి చూడంగానే మురళీ మోహన్ గారి అపార్ట్మెంట్ నచ్చిందట. మురళీ మోహన్ గారు అపార్ట్మెంట్ తన కుటుంబం కోసం కట్టించుకున్నారు. ఆరంజ్ కౌంటీలో పైన ఫ్లోర్ లలో కొన్ని అపార్ట్మెంట్స్ కట్టించి ఒక్కొక్క ఇంటికి స్పెషల్గా స్విమ్మింగ్ పూల్, అలా అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి తనకోసం, తన పిల్లల కోసం, ఇంకొకటి వాళ్ళ తమ్ముడు కోసం కట్టించుకున్నారట. కానీ నాగ చైతన్య అపార్ట్మెంట్ కావాలి అని అడిగారు.

murali mohan about naga chaitanya apartment

అందుకు మురళీ మోహన్ గారు కుదరదు అని, ఎందుకంటే ఇది తన కుటుంబం కోసం కట్టించుకున్నాను అని చెప్పారు. నాగ చైతన్య నాగార్జునకి చెప్పి మురళీ మోహన్ గారితో మాట్లాడించారు. నాగార్జున, మురళీ మోహన్ చాలా మంచి మిత్రులు కాబట్టి నాగార్జున బాగా రిక్వెస్ట్ చేయడంతో మురళీ మోహన్ గారు కాదనలేక ఆ ఇల్లు ఇచ్చారట. ప్రస్తుతం ఆ ఇంట్లో సమంత ఒక్కరే ఉంటున్నారు. ఈ విషయాన్ని మురళీ మోహన్ గారు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video : 

You may also like