Ads
సెలబ్రిటీల జీవితం ఒక తెరిచిన పుస్తకంలాంటిది. వారికి సంబంధించిన చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు అన్నీ వాళ్లు అధికారికంగా ప్రకటించకుండానే వైరల్ అయిపోతాయి. ఇప్పుడు అదే విధంగా నాగ చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన విషయాల గురించి కూడా అంతకుముందే చాలా పుకార్లు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం వారిద్దరూ అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల విషయం ప్రకటించిన తర్వాత చాలా మంది సమంతని తప్పుపట్టడం మొదలుపెట్టారు. ఈ విషయంపై ఎట్టకేలకు సమంత స్పందించారు.
Video Advertisement
ఇంస్టాగ్రామ్ స్టోరీలో సమంత ఈ విధంగా పేర్కొన్నారు. “నా వ్యక్తిగత జీవితం గురించి మీరు ఆలోచించిన విధానం నన్ను కదిలించింది. తప్పుడు వార్తలనుండి, పుకార్లనుండి నన్ను సమర్ధించడానికి ప్రయత్నించిన మీ అందరికీ చాలా థాంక్యూ. నాకు అఫైర్స్ ఉన్నాయి అన్నారు. నేను పిల్లలు వద్దు అని అనుకున్నాను అని అన్నారు. నేను ఒక అవకాశవాది అని అన్నారు. ఇంక ఇప్పుడు అయితే ఏకంగా నాకు అబార్షన్స్ అయ్యాయి అని అంటున్నారు.
డివోర్స్ అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ బాధ నుండి కోలుకోవడానికి నన్ను ఒక్క దాన్ని వదిలేయండి. నాపై కనికరం లేకుండా వ్యక్తిగతంగా ఎటాక్ చేస్తున్నారు. కానీ నేను మీ అందరికీ ఒక మాట ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవరు ఏమన్నా కానీ అవన్నీ నాపై ప్రభావం చూపడానికి నేను అనుమతించను.” అని సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నారు.
End of Article