Home Filmy Adda ఇద్దరూ ఒకే సంవత్సరంలో పుట్టారు..కానీ వయసు మాత్రం తేడా.! అలా ఎలా.?

ఇద్దరూ ఒకే సంవత్సరంలో పుట్టారు..కానీ వయసు మాత్రం తేడా.! అలా ఎలా.?

by Mohana Priya

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు కొండ పొలం సినిమాతో మన ముందుకు వచ్చారు.  ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు సంగీత దర్శకత్వం వహించారు. తన పెర్ఫార్మెన్స్ తో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే ఎంతో పేరు సంపాదించారు. ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు.

Heroines who acted with brothers

కొండ పొలంలో కటారు రవీంద్ర యాదవ్ పాత్రలో వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయిచంద్ గారు, నాజర్ గారు, కోట శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణ గారు, హేమ, రవి ప్రకాష్, మహేష్ విట్ట, రచ్చ రవి, ఆనంద్ విహారి ముఖ్య పాత్రల్లో నటించారు.

age difference between vaisshanv tej and rakul preet singh

కొండ పొలం సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అలాగే హీరో వైష్ణవ్ తేజ్ బిగ్ బాస్ ప్రోగ్రాంకి వచ్చారు. ఇందులో నాగార్జున, “ఇంత చిన్న వయసులోనే రకుల్ తో యాక్ట్ చేశావా?” అని వైష్ణవ్ తేజ్ ని అడిగారు. అయితే, రకుల్ ప్రీత్ సింగ్, వైష్ణవ్ తేజ్ ఒకటే సంవత్సరంలో పుట్టారు. కేవలం నెలల తేడా అంతే. 1990 జనవరిలో వైష్ణవ్ తేజ్ పుడితే, అదే సంవత్సరం అక్టోబర్ నెలలో రకుల్ ప్రీత్ సింగ్ పుట్టారు. కానీ ఇద్దరు వయసు మాత్రం ఒకటే. ఇంకా చెప్పాలంటే వైష్ణవ్ తేజ్ రకుల్ కంటే కొన్ని నెలలు పెద్దవారు.

You may also like