Home Bigg Boss 5 telugu “ఆ ఒక్క రూపాయి బిళ్ళ వల్ల నా జీవితం మారిపోయింది.!” అంటూ తన కథని చెప్పిన బిగ్‌బాస్ ప్రియాంక.!

“ఆ ఒక్క రూపాయి బిళ్ళ వల్ల నా జీవితం మారిపోయింది.!” అంటూ తన కథని చెప్పిన బిగ్‌బాస్ ప్రియాంక.!

by Mohana Priya

జబర్దస్త్ ద్వారా తన కెరియర్ మొదలుపెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా ప్రేక్షకులకు ఇంకా చేరువ అయిన కంటెస్టెంట్ ప్రియాంక. అయితే, బిగ్ బాస్ లో ప్రియాంక ఇటీవల ఒక విషయాన్ని వెల్లడించారు. ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాల గురించి అంతకుముందు కూడా బిగ్ బాస్ లో మాట్లాడారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ప్రియాంకకి తన కుటుంబం సర్ప్రైస్ ఇచ్చింది.

bigg boss telugu 5 priyanka shares her story

ఈ వీడియోలో ప్రియాంక తండ్రి మాట్లాడుతూ, “కూతురు అయినా కొడుకు అయినా నువ్వే. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నువ్వు బాధపడకు. మమ్మల్ని ఏ లోటు లేకుండా నువ్వు చూసుకుంటున్నావు. అంతకంటే మాకు ఏం కావాలి? నువ్వు ధైర్యంగా ఉండు” అని చెప్పారు. ఈ వీడియో చూసిన ప్రియాంక ఎమోషనల్ అయ్యారు.అయితే సాయి తేజ నుండి ప్రియాంక గా మారడం అనేది దైవ నిర్ణయమని ప్రియాంక అంటారు. ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నప్పుడు ఎవరి సలహా తీసుకోవాలో తెలియక ప్రియాంక జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ టెంపుల్ కి వెళ్లారు.

bigg boss telugu 5 priyanka shares her story

జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. అక్కడికి వెళ్ళి అమ్మవారి సన్నిధిలో ఒక రూపాయి కాయిన్ నిలబెట్టి, మనసులో కోరిక కోరుకుంటే, ఒకవేళ ఆ కాయిన్ నిలబడితే మన కోరిక తీరుతుంది అని అంటారు. అయితే, ప్రియాంక కూడా తను ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నప్పుడు పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి రూపాయి కాయిన్ పెట్టి తన మనసులో కోరికని చెప్పారు. అప్పుడు ఆ రూపాయి కాయిన్ కింద పడకుండా నిలబడింది. అప్పుడు ప్రియాంక ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్ జెండర్ గా మారాను అని చెప్పారు. ప్రియాంకని వరలక్ష్మి అని కూడా పిలుస్తారు అని చెప్పారు.

You may also like