Home Filmy Adda ఈ “7” హీరోలు తెరపై కనిపించి ఎన్ని సంవత్సరాలయ్యిందో తెలుసా.?

ఈ “7” హీరోలు తెరపై కనిపించి ఎన్ని సంవత్సరాలయ్యిందో తెలుసా.?

by Mohana Priya

సాధారణంగా హీరోలంటే ప్రతి సంవత్సరం ఒక సినిమా ఖచ్చితంగా విడుదల ఉండేలా చూసుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల కానీ, లేదా సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల కానీ చాలా మంది స్టార్ హీరోలు కొన్ని సంవత్సరాల నుండి తెరపై కనిపించడం లేదు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 ప్రభాస్

ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా విడుదలయ్యి 2 సంవత్సరాలు అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ రాబోయే సినిమాల గురించి అప్‌డేట్స్ వస్తున్నాయి కానీ సినిమా విడుదల మాత్రం ఆలస్యం అవుతోంది.

bachelor heroes in tollywood

#2 వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ చివరిగా 2019 లో విడుదలైన గద్దలకొండ గణేష్ లో నటించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని అలాగే ఎఫ్ 3 విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Heroes who did not have releases from past few years

#3 అల్లు శిరీష్

అల్లు శిరీష్ కూడా చివరగా ఏబిసిడిలో కనిపించారు. ప్రస్తుతం ప్రేమ కాదంట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Heroes who did not have releases from past few years

#4 జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ విడుదలయ్యి 3 సంవత్సరాలు గడిచింది.

Heroes who did not have releases from past few years

#5 రామ్ చరణ్

ప్రస్తుతం RRR షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు.

Heroes who did not have releases from past few years

#6 మంచు మనోజ్

మంచు మనోజ్ తెరపై కనిపించి చాలా సంవత్సరాలు అయింది. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

#7 అఖిల్ అక్కినేని

మిస్టర్ మజ్ను తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఈ సంవత్సరం హిట్ కొట్టారు అఖిల్ అక్కినేని.

Heroes who did not have releases from past few years

You may also like