Home serials “మొగలిరేకులు” సీరియల్ నటుడిపై భార్య సంచలన కామెంట్స్.! (వీడియో)

“మొగలిరేకులు” సీరియల్ నటుడిపై భార్య సంచలన కామెంట్స్.! (వీడియో)

by Mohana Priya

మొగలిరేకులు సీరియల్ ద్వారా సీరియల్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న నటుడు పవిత్ర నాథ్. ఈ సీరియల్ లో దయ అనే పాత్రలో నటించారు. పవిత్ర నాథ్ కేవలం మొగలిరేకులు సీరియల్ లో మాత్రమే కాకుండా ఇంకా కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. అయితే, పవిత్ర నాథ్ గురించి అతని భార్య శశిరేఖ కొన్ని విషయాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిరేఖ మాట్లాడుతూ, “2009లో వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది. కానీ అప్పటి నుంచి అతనికి అమ్మాయిలంటే పిచ్చి ఉంది” అని చెప్పారు.

mogali rekulu fame pavitra nath wife reveals about his character

“కొంత మంది అమ్మాయిలని నేరుగా ఇంటికి తీసుకువచ్చాడు” అని శశిరేఖ చెప్పారు. “ఒక అమ్మాయితో ఎనిమిదేళ్లు అఫైర్ నడిపాడు అని, ఆ అమ్మాయికి తెలియకుండా మరొక అమ్మాయితో కూడా అఫైర్ నడిపాడు” అని చెప్పారు. ఈ విషయం అంత పవిత్ర నాథ్ తల్లిదండ్రులకు చెప్తే, వారు కూడా తనని పట్టించుకోలేదు అని, ఇంటి నుండి గెంటేశారు” అని శశిరేఖ అన్నారు. “పదేళ్లుగా తాను నరకం అనుభవిస్తున్నాను అని, విడాకులు కూడా ఇవ్వట్లేదు అని, కష్టపడి జాబ్ తెచ్చుకొని తానే పిల్లల్ని పోషిస్తున్నాను” అని చెప్పారు.

mogali rekulu fame pavitra nath wife reveals about his character

“తన వృత్తిపరమైన విషయాలు గురించి కానీ, లేదా ఇల్లు కొనడంలాంటి ముఖ్యమైన విషయాల గురించి కానీ, తనకి పవిత్ర నాథ్ అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు” అని చెప్పారు. “భార్య భర్తలు అన్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటారు అని, కానీ వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదు” అని అన్నారు. “తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదు అని, అందుకే పవిత్ర నాథ్ ని అరెస్ట్ చేసి శిక్షించాలని” అన్నారు శశిరేఖ.

watch video : 

https://youtu.be/ZZUrGIT7MZU

You may also like