BRS వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు దీటైన జవాబు ఇచ్చారా ?

BRS వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు దీటైన జవాబు ఇచ్చారా ?

by Jyosthna Devi

Ads

ఉచిత విద్యుత్ కు నాంది కాంగ్రెస్. ఉచిత విద్యుత్ ప్రారంభం కాంగ్రెస్ పాలనలోనే నెరవేరింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెరుగుతున్న వేళ అంతుచిక్కని బీఆర్ఎస్ పవర్ రాజకీయం మొదలు పెట్టింది. వక్రీకరణ, కుట్రలకే కేరాఫ్ చిరునామాగా మారిన ప్రగతి భవన్ లో కొత్త స్కెచ్ సిద్ధం చేసారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి, కాంగ్రెస్ కు ఉచిత విద్యుత్ రద్దు అంటుందంటూ ఆగమాగం చేస్తున్నారు. గులాబీ నేతలు రోడ్డు ఎక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన ఉచిత విద్యుత్ నే కేసీఆర్ కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రారంభించింది కావటంతో తన పథకాల లాగా రద్దు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. విద్యుత్ విషయంలో కేసీఆర్ ను నిలదీస్తున్నారు.

Video Advertisement

Operation Congress' In Telangana | Decoding the Rush To Congress In Telangana | News9 - YouTube

తెలంగాణలో కాంగ్రెస్ జోరును తట్టుకోవటం పైన ప్రగతి భవన్ లో మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ ను ఎలా బద్నాం చేయాలనే ఆలోచన పైన తర్జన భర్జన పడుతున్నారు. రేవంత్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. కట్ పేస్ట్ నైపుణ్యంతో ఒక వీడియో బయటకు తీసుకొచ్చారు. అంతే, రైతులకు ఉచిత విద్యుత్ కు కాంగ్రెస్ వ్యతిరేకమనే ప్రచారం తెర మీదకు తెచ్చారు. పార్టీ నేతలంతా రోడ్డు మీదకు రావాలని ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ లో ప్రజలకు మద్దతు పెరుగుతున్న వేళ రాజకీయంగా అడ్డుకునేందుకు అస్త్రాలు లేవు. దీంతో, అసత్యాలే ఆయుధంగా ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కీ లాంటి వారు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు.

Telangana: Komatireddy Venkat Reddy meets new Congress in-charge, appears defiant

అసలు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్. 2004 ఎన్నికల వేళ నాటి సీఎం చంద్రబాబు ఉచిత విద్యుత్ సాధ్యం కాదు.. అదే చేస్తే రైతులు కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా నాటి సీఎల్పీ నేత వైఎస్సార్ తన పాదయాత్రలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. రైతులు కాంగ్రెస్ నేతగా వైఎస్సార్ ఇచ్చిన హామీని నమ్మారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అధికారంలోకి వస్తూనే నాటి కాంగ్రెస్ సీఎంగా ఉచిత విద్యుత్ నిర్ణయం పై తన ప్రమాణ స్వీకార వేదిక పైనే 2004లో సంతకం చేసారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు ప్రారంభం అయింది. ఆ తరువాత రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కు నిర్ణయం తీసుకున్నారు.

 

ఇప్పుడు తిరిగి రైతులు..మహిళలు..యువతే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం అవుతుంది. దీనిని పసిగట్టిన బీఆర్ఎస్ ఏం చేయాలో తెలియక, అంతు చిక్కని పరిస్థితుల్లో దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. రైతులకు ఇంకా ఎంత మేలు చేయాలని నిరంతరం ఆలోచించే పార్టీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేసారు. ఉచిత విద్యుత్ సమయాన్ని తగ్గించాలనే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఖచ్చితంగా రైతు పక్షపాత పార్టీగా..అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి వారికి మేలు చేసే నిర్ణయాల దిశగానే అడుగులు వేస్తామని భట్టి స్పష్టంగా ప్రకటించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో బడ్జెట్ కేటాయింపుల్లో రైతులకు రెట్టింపు కేటాయింపులు..డబుల్ ఆదాయం వచ్చేలా నిర్ణయాలు ఉంటాయని భట్టి విక్రమార్క తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చారు. ఇక పార్టీ క్యాంపెయనర్ గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి అదే విషయాన్ని స్పష్టం చేసారు.


End of Article

You may also like