సాధారణంగా ప్రతి మనిషి ఏదో ఒక దానికి భయపడతాడు. కొన్ని భయాలు అయితే ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో అని బయటికి కూడా చెప్పలేరు. చీకటంటే భయపడం, లేదా పురుగులు అంటే భయపడం అలా అన్నమాట. భయం అనేది ఒక మనిషికి సహజం. ఇంకా చిన్న పిల్లలకైతే భయాలు ఎక్కువగా ఉంటాయి. అందరూ కాదు చాలా మంది చిన్న పిల్లలు సాధారణ వస్తువుని, లేదా ఇంక దేన్నైనా చూసి భయపడచ్చు. కొంతమంది పిల్లలు దేనికి భయపడరు.

చిన్నప్పుడు చేసే పనులు సరదాగా ఉంటాయి కాబట్టి, ఎంతోమంది చిన్నపిల్లలు చేసే పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలా చిన్న పిల్లలు, తెలిసీ తెలియకుండా చేసే సరదా పనులను అప్లోడ్ చేసే పేజెస్ లో వెల్కమ్ టు నేచర్ ఒకటి.

ఈ పేజ్ లో చిన్నపిల్లల వీడియోస్ తో పాటు, జంతువుల వీడియోస్ పెడుతుంటారు. అలాగే ఇటీవల ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఒక బాబు ఇంట్లో నడుస్తూ ఉండగా వాక్యూమ్ క్లీనర్ సౌండ్ వినిపించి భయపడి, అక్కడే ఉన్న తమ పెంపుడు కుక్క పక్కకి వెళ్ళి ఆ కుక్క పక్కనే నిల్చుని ఉంటాడు. ఈ వీడియోని వెల్కమ్ టు నేచర్ తమ ట్విట్టర్ అకౌంట్ లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ముఖ్యంగా ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

watch video: