Ads
తమిళనాడులో జరిగిన ఒక సంఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, న్యూస్18 తెలుగు కథనం ప్రకారం, తమిళనాడుకు అరియలూర్ జిల్లా జయాన్కొండమ్ సమీపంలోని పెరియకరుక్కై గ్రామానికి చెందిన రాధాకృష్ణన్ అనే ఒక వ్యక్తి తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్ కండక్టర్ గా పని చేస్తున్నారు.
Video Advertisement
రాధాకృష్ణన్ ఇప్పటివరకూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా కడలూరు జిల్లాకు చెందిన పరమేశ్వరి అనే మహిళతో వివాహేతర సంబంధంలో సాగించారు. పరమేశ్వరికి భర్త లేరు. ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. రాధాకృష్ణన్ కి పిల్లలు లేరు. దాంతో రాధాకృష్ణను పరమేశ్వరిని ఒప్పించి, తన పెద్ద కూతురుని పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఇందుకు రాధాకృష్ణన్ తల్లి కూడా మద్దతు పలికారు. మైనర్ బాలికని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాకుండా వివాహేతర సంబంధం ఉన్న మహిళ కూతురు అని తెలిసి కూడా ఆ బాలికను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు రాధాకృష్ణన్.
పరమేశ్వరి, రాధాకృష్ణన్ తల్లి సమక్షంలో ఒక ఆలయంలో గత ఆగస్ట్ 6వ తేదీన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అమ్మాయిని బలవంతం చేయడంతో గర్భవతి అయ్యింది. ప్రస్తుతం ఆ బాలిక 5 నెలల గర్భవతి గా ఉంది. రాధాకృష్ణన్ గురించి అరియలూరు జిల్లా బాలల సంరక్షణ విభాగ అధికారి కార్తికేయన్ కి తెలియడంతో రాధాకృష్ణన్ పై చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి. అతనిని అరెస్ట్ చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ, రాధాకృష్ణన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం అని చెప్పారు. అలాగే పరమేశ్వరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించాము అని అన్నారు.
End of Article