Ads
బందరు నగరం ఇనగుదురు పేట మండలంలో ఇటీవల ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈనాడు కథనం ప్రకారం కుమ్మరిగూడెం ప్రాంతానికి చెందిన గిరిబాబు గోల్డ్ కవరింగ్ పని చేస్తూ ఉండేవారు. గిరిబాబు కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్లలో పెద్దమ్మాయి రేణుక దేవి. 6 నెలల క్రితం రేణుక మరణించింది.
Video Advertisement
అప్పటి నుండి గిరిబాబు ఎంతో మనస్తాపానికి గురయ్యారు. అప్పుడప్పుడు రేణుక సమాధి దగ్గరికి వెళ్లి బాధపడి వస్తూ ఉండేవారు. సోమవారం కూడా అలాగే రేణుక సమాధి దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్లిన గిరిబాబు ఎంతసేపైనా తిరిగి రాలేదు.
దాంతో ఆచూ కోసం వెతకగా రేణుక సమాధి దగ్గర మృతి చెంది కనిపించారు. ఘటనా జరిగిన స్థలాన్ని సిఐ శ్రీనివాసరావు పరిశీలించారు. గిరిబాబు భార్య లక్ష్మి తమ కూతురు రేణుక మృతిచెందడంతో మానసిక వేదన తో బాధపడి గిరిబాబు మృతి చెందారు అని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
End of Article