Ads
ఆలుగడ్డలతో కోట్లు సంపాదించడం ఎప్పుడైనా విన్నారా? అది నిజంగానే జరిగింది. వివరాల్లోకి వెళితే బ్రిటన్ కి చెందిన పప్పీ ఓ తూలే (poppy o’toole) ఒక ప్రముఖ సంస్థ లో కుక్ గా పని చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. అందులో పప్పీ కూడా ఒకరు. తన ఉద్యోగం పోయింది అని తెలిసిన తర్వాత పప్పీ కి ఏం చేయాలో అర్థం కాలేదు.
Video Advertisement
ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడే ఈ ఐడియా వచ్చింది. పప్పీ తన పేరెంట్స్ సహాయంతో టిక్ టాక్ లో వీడియోలు చేయడం ప్రారంభించారు. అయితే ఒకసారి ఆలుగడ్డ త వండిన ఒక రెసిపీ ని తన టిక్ టాక్ లో షేర్ చేశారు. ఈ వీడియో చాలా ఫేమస్ అయ్యింది. దీనికి అనుకోనంత రెస్పాన్స్ వచ్చింది. దాంతో పప్పీ ఇలాగే మెల్లగా వంటలు చేసి అవి షేర్ చేయడం మొదలుపెట్టారు.
అందులోనూ ముఖ్యంగా కేవలం ఆలుగడ్డ తో వండిన వంటలను మాత్రమే షేర్ చేసే వాళ్ళు. దాంతో ఆ వీడియోస్ కి ఎన్నో వ్యూస్ రావడం మొదలయ్యాయి. ఒక వీడియో కి అయితే ఏకంగా రెండు కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు అమెరికాలో ఉన్న పెద్ద టిక్ టాక్ స్టార్ లలో ఒకరిగా నిలిచారు పప్పీ.
అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పని చేస్తూనే కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు పప్పీ. పప్పీ తన వంటలతో ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. దాని పేరు రెసిపీ బుక్ సెప్టెంబర్ 2021. ప్రస్తుతం పప్పీ అమెరికన్ ఎక్స్ప్రెస్ కోసం పని చేస్తున్నారు. పప్పీ ఏ వీడియో పెట్టినా కూడా దానికి వీడియోస్ మూడు లక్షలకు పైగా ఉంటాయి. ఆమె టిక్ టాక్ లో 16 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
End of Article