Ads
కొన్ని సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక ట్రెండ్ సెల్ఫీ. ఈ సెల్ఫీ ట్రెండ్ మెల్లగా స్టార్ట్ అయ్యి ప్రపంచం మొత్తం పాకింది. ఒక పాయింట్ తర్వాత మామూలుగా సెల్ఫీ తీసుకోవడం కామన్ అయిపోయి డిఫరెంట్ గా సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించడం మొదలు పెట్టారు. దాని కోసం డిఫరెంట్ పోజ్ లలో, డిఫరెంట్ లొకేషన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు.
Video Advertisement
అందులో కొన్ని రిస్కీగా ఉండడం వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇటీవల ఇలాంటి ఒక సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లా సుఖేడా గ్రామానికి చెందిన ఒక యువతి ఒక బావి దగ్గర సెల్ఫీ దిగుదామని అనుకుంది. ఆ బావి లోతు 85 అడుగులు. బావి దగ్గర సెల్ఫీ దిగే క్రమంలో బావిలో పడిపోయింది.
అదే దారిలో ఉన్న ఒక యువకుడు బావి నుండి వినిపిస్తున్న అరుపులు విని బావి దగ్గరికి వెళ్లి చూశాడు. ఆ బావిలో ఉన్న యువతిని కాపాడటానికి తాను కూడా బావిలోకి దూకాడు. ఆ యువతిని కాపాడాడు కానీ బావిలో నుంచి తిరిగి బయటికి వచ్చే దారి లేదు. దాంతో ఆ యువకుడు ఇంకా యువతి కాపాడమని గట్టిగా అరవడం మొదలు పెట్టారు.
అటుగా వెళుతున్న కొంత మంది స్థానికులు వారి అరుపులు విని వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారేమోనని భావించారు. దాంతో ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు అక్కడికి దగ్గరికి వచ్చి స్థానికుల సహాయంతో వారిద్దరినీ బయటికి తీశారు. అసలు ఏం జరిగింది అని పోలీసులు అడగగా ఆ యువకుడు జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు ఆ యువతిని మందలించి పంపించారు.
End of Article