Ads
కరోనా వైరస్ వల్ల ఎంతో మంది తమ కుటుంబాలను విడిచి దూరంగా ఉంటున్నారు. అందుకు కారణం వాళ్ళు ఎక్కడైనా ఇరుక్కుపోవడం కావచ్చు లేదా క్వారంటైన్ లో ఉంది తిరిగి రావడం కావచ్చు. వైరస్ పక్కవాళ్లకు వ్యాపించకుండా ఉండాలంటే కచ్చితంగా తమ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోంది.
Video Advertisement

ఇటీవల పూణేలోని ధంకవాడికి చెందిన సలోని సాట్‌పుట్ ఐసోలేషన్ పీరియడ్ తర్వాత ఇంటికి వచ్చిన తన సోదరికి ప్రత్యేక శైలిలో స్వాగతం చెప్పింది. వాళ్ళు ఉండే వీధిలో డాన్స్ చేసి తన సోదరిని ఆహ్వానించింది సోనాలి.
ఇది కేవలం తన సోదరి ధైర్యంగా పోరాడి వచ్చినందుకు మాత్రమే కాదని వాళ్లు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంచెం కూడా మద్దతుకు ముందుకు రాని చుట్టుపక్కల వాళ్లకి పాఠం చెప్పడానికి కోసం కూడా అని చెప్పింది.
This video gave me immense positivity.
Corona positive person returning home after beating the disease 😭♥️🙌🏼 pic.twitter.com/QJRiiI0aVi
— Godman Chikna (@Madan_Chikna) July 18, 2020
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను దాదాపు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. 17 వేల కి పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సలోని తండ్రికి జూలై 4న కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత తన తాతయ్య, నాయనమ్మ, సోదరి, తల్లికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో వాళ్లు వేరు వేరు ఆసుపత్రిలో చేరారు.
ఒంటరిగా ఉన్న సలోని ని చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. అసలు సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. బంధువులు, ఇంకా తన సోదరి స్నేహితులు వచ్చి సలోనికి సహాయం చేశారు.

సలోని సోదరి స్నేహల్ మాట్లాడుతూ ” మేము ఆసుపత్రిలో ఉన్నప్పుడు సలోని ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మాకు ఏమీ చెప్పలేదు. మరీ ఒంటరిగా అనిపించినప్పుడు, చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన భరించలేనప్పుడు విషయం గురించి క్లుప్తంగా చెప్పింది” అని అన్నారు.
End of Article
