అక్కడ కిలో జీడిపప్పు రూ. 10 మాత్రమే…అంత తక్కువకి ఇవ్వడానికి కారణం ఏంటంటే?

అక్కడ కిలో జీడిపప్పు రూ. 10 మాత్రమే…అంత తక్కువకి ఇవ్వడానికి కారణం ఏంటంటే?

by Mohana Priya

Ads

పండగలప్పుడు కానీ లేదా ఇంకా ఏదైనా సందర్భాలు అప్పుడు కానీ స్పెషల్ వంటకాలు చేస్తే అందులో జీడిపప్పు తప్పకుండా వాడుతారు. భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా కూడా జీడిపప్పు కి చాలా క్రేజ్ ఉంటుంది. స్వీట్స్ లోనే కాకుండా కొన్ని మామూలు వంటల్లో కూడా జీడిపప్పు వాడతారు. డైరెక్ట్ గా నే కాకుండా కొన్ని కూరలలో జీడి పప్పు ని పేస్ట్ చేసి వండుతారు.

Video Advertisement

అంతేకాకుండా జీడిపప్పు లో ఉన్న ప్రోటీన్స్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ గుండెకి చర్మానికి జుట్టుకి ఎంతో మంచిది. జీడిపప్పు తరచుగా రోజుకి ఒక నాలుగైదు చొప్పున తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. ఇంకా కంటికి కూడా జీడిపప్పు మంచిదట. బరువు తగ్గడానికి కూడా జీడిపప్పు ని తీసుకుంటారట.

జీడిపప్పు కి ఉన్న క్రేజ్ కి తగ్గట్టే వాటి ధర కూడా ఉంటుంది. మామూలుగా అయితే కేజీ జీడిపప్పు 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది.  ఎందుకంటే దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో జీడిపప్పు తక్కువగా పండిస్తారు. కాబట్టి ట్రేడర్లు కూడా తక్కువ ధరకి అమ్మరు.

కానీ ఒక ప్రాంతంలో మాత్రం కిలో జీడిపప్పు ధర పది రూపాయలు మాత్రమే అట. అది కూడా భారత దేశంలోనే. జార్ఖండ్ లోని జమ్తారా ప్రాంతంలో ఒక కేజీ జీడిపప్పు పది రూపాయలకి అమ్ముతారట.

అంత తక్కువ ధరకే అమ్మడానికి కారణం ఏంటి అంటే ఆ ప్రాంతంలో దాదాపు 49 ఎకరాల స్థలంలో జీడిపప్పు పండిస్తారట. అందుకే అంత తక్కువ ధరకి అమ్ముతారట. చాలా మంది వేరే ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడ జీడిపప్పు ఎక్కువ మొత్తంలో కొనుక్కుని వెళ్తారట.


End of Article

You may also like