Ads
మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన వ్యాపారం కోసం హెలికాఫ్టర్ కొనుక్కున్న విషయం ప్రస్తుతం చర్చలో ఉంది. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని భివాండిలో నివసించే జనార్ధన్ భోయిర్ అనే ఒక బిల్డర్ ఇటీవల డైరీ బిజినెస్ వ్యాపారంలో అడుగుపెట్టారు. ఈ వ్యాపారం ద్వారా జనార్ధన్ మన దేశంలోని ఎన్నో ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
Video Advertisement
దాంతో జనార్ధన్ 30 కోట్ల రూపాయల ఖరీదు గల ఒక హెలికాప్టర్ కొనుగోలు చేశారు. జనార్ధన్ ఈ విషయంపై మాట్లాడుతూ తాను పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రదేశాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని, అక్కడ ఎయిర్ పోర్ట్ సౌకర్యం లేని కారణంగా తనకి ఎన్నో గంటలు ప్రయాణించాల్సి వచ్చేదని.
తన స్నేహితుడి సలహాతో తాను హెలికాప్టర్ కొనుగోలు చేశాను, తను డైరీ బిజినెస్ తో పాటు వ్యవసాయ పనులు కూడా చూసుకుంటాను అని చెప్పారు. అంతే కాకుండా 2.5 ఎకరాల భూమిపై హెలిపాడ్ కూడా ఏర్పాటు చేశారు. గత ఆదివారం హెలికాప్టర్ ని జనార్దన్ నివసించే ప్రదేశానికి ట్రయల్ కోసం పంపించారు. హెలికాప్టర్ మార్చి 15వ తేదీన వస్తుంది అని జనార్ధన్ అన్నారు.
End of Article