Ads
సాధారణంగా ఇంట్లో చెత్త ఉంటేనే చాలా మందికి చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి ఒక దశాబ్ద కాలం చెత్త పోగు చేశాడు. అంతే కాకుండా కోటీశ్వరుడు కూడా అయ్యాడు. వినడానికే చాలా వింతగా ఉంది కదా ? వివరాల్లోకి వెళితే, సౌత్ కొరియాలోని ఒక తండ్రి తన కొడుకు పనీ పాటా లేకుండా తిరుగుతున్నాడు అని కోపం తెచ్చుకున్నాడు.
Video Advertisement
అలా ఇంట్లోనే ఉండి ఆ కొడుకు దాదాపు 100 కేజీల వరకు బరువు పెరిగాడట. ఈ కోపానికి నిరసనగా ఆ తండ్రి తన ఇంట్లో చెత్తని పోగు చేయడం మొదలు పెట్టాడు. ఆ చెత్త అలా పోగు అయ్యి ఒక దశాబ్దం గడిచింది. అలా పోగైన చెత్త వాసన వల్ల అతని భార్యకు అనారోగ్యం కలిగింది. దాంతో డాక్టర్లు వెంటనే ఆ చెత్త తొలగించాలి అని చెప్పారు.
ఇంక డాక్టర్లు చెప్పడంతో చేసేదేమీ లేక తండ్రి ఇంట్లో ఉన్న చెత్త మొత్తాన్ని అమ్మేశాడు. అలా అమ్మడం ద్వారా ఆయనకు 36 కోట్ల రూపాయలు లభించాయి. ఆ చెత్త దాదాపు 150 టన్నుల బరువు ఉందట. దాంతో ఇదంతా చూసిన ఆ చుట్టుపక్కల జనమంతా “కొడుకు కోసం ఆస్తిగా ఈ చెత్తనంతా పోగు చేశాడు ఏమో” అని అన్నారట.
నిజానికి, ఆ తండ్రి అలా చెత్త పోగు చేయడానికి గల కారణం ఏంటంటే, తన కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు ఆ కంపుని భరించలేక బయటికెళ్ళి ఏమైనా ఉద్యోగం చేసుకుంటాడు ఏమో అని. కానీ ఇక్కడ మాత్రం వేరే విధంగా జరిగింది. ఆ వ్యక్తి పేరు చోయి అని, ఆయనకు 75 సంవత్సరాలు అని, అలాగే వారి కొడుకుకి 40 సంవత్సరాలు అని, కొడుకు సెకండ్ ఫ్లోర్ లో ఉంటే, తల్లిదండ్రి కింద ఫ్లోర్ లో ఉంటారు అని తెలిసింది.
End of Article