తల్లిదండ్రులని పిల్లలు గౌరవించాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఒకవేళ చెప్పకపోయినా కూడా అది పిల్లల బాధ్యత కాబట్టి వారి తల్లిదండ్రులని పిల్లలు అందరూ గౌరవించాలి. ఒక వయసు తర్వాత తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లలు తీసుకోవాలి. అలా చాలామంది చేస్తున్నారు.

Video Advertisement

కానీ కొంతమంది మాత్రం తల్లిదండ్రులని భారంగా అనుకుంటూ ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారు చేసే పనులు వారి తల్లిదండ్రులకు మాత్రమే కాదు చూసే వారికి కూడా బాగా అనిపించదు. అలాంటి సంఘటన ఇటీవల జరిగింది.

a man in indore left his mother on road

వివరాల్లోకి వెళితే, ఇండోర్ కి చెందిన రామేశ్వర్ ప్రజాపత్ లాక్ డౌన్ ముందు మాల్వా మిల్లు ప్రాంతంలో పాన్ దుకాణం నడిపేవారు. తన తల్లి, ముగ్గురు కొడుకులతో కలిసి ఉండేవారు. లాక్ డౌన్ సమయంలో రామేశ్వర్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటినుండి రామేశ్వర్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా రామేశ్వర్ ముగ్గురు కొడుకులు రామేశ్వర్ తల్లిని తమతోపాటు ఉంచుకోవడానికి ఇష్టపడలేదు.

a man in indore left his mother on road

అందుకు రామేశ్వర్ కొడుకుల ఒత్తిడి తట్టుకోలేక, అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవ్వడంతో తన తల్లిని శనివారం రాత్రి 10:30 కి భూతేశ్వరాలయం పక్కన ఉన్న రోడ్డుపై వదిలేశారు. అలాగే తన తల్లి బట్టలు, మంచం కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ వృద్ధురాలిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పందించి ఆ వృద్ధురాలిని వృద్ధాశ్రమానికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రామేశ్వర్ ఆదివారం వృద్ధాశ్రమానికి వెళ్లి తన తల్లిని క్షమించమని వేడుకున్నారు. తనకి ముగ్గురు కొడుకులు ఉన్నారు అని, వారి నాయనమ్మని వారు భరించలేకపోయారు అని, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని రామేశ్వర్ చెప్పారు.