నిద్ర లేవగానే భార్య,పిల్లలని మర్చిపోయాడు..! అసలు ఏం జరిగిందంటే..?

నిద్ర లేవగానే భార్య,పిల్లలని మర్చిపోయాడు..! అసలు ఏం జరిగిందంటే..?

by Mohana Priya

Ads

సాధారణంగా ఎవరికైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత మతిమరపు వస్తూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి 37 సంవత్సరాల వయసులోనే గతం మర్చిపోయాడు. నిద్ర లేవగానే తాను స్కూల్ కి వెళుతున్న పదహారేళ్ల అబ్బాయిలా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. వివరాల్లోకి వెళితే, డానియల్ పోర్టర్ అనే వ్యక్తి టెక్సాస్ లో నివసిస్తున్నాడు. అతనికి భార్య, కూతురు కూడా ఉన్నారు.

Video Advertisement

A man lost his memory after waking up

అయితే అతను నిద్రపోయి లేచిన తర్వాత తన గతమంతా మర్చిపోయి, అద్దంలో తనని తాను చూసుకొని, “నేను ఏంటి ఇంత లావు అయ్యాను? ఇంత పెద్ద వాడిలా కనిపిస్తున్నాను?” అని అనడం మొదలు పెట్టాడట. అతని భార్య రుత్ వాళ్లకి పెళ్లి అయ్యింది అని చెప్పడానికి ప్రయత్నించినా కూడా అతను వినకుండా తాను ఇంకా స్కూల్ కి వెళ్లే అబ్బాయి అని వాదించాడు.

A man lost his memory after waking up

అతనిని పరీక్షించిన వైద్యులు, అతనికి ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా ఉంది అని చెప్పారు. దీనినే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారు. అయితే 24 గంటల్లో పరిస్థితి అంతా సర్దుకుంటుంది అని చెప్పారు. గత మార్చిపోవడంతో డానియల్ భార్య అతనిని వాళ్ళు ఊరికి తీసుకువెళ్లి, స్నేహితులతో మాట్లాడించింది.

A man lost his memory after waking up

ఈ విషయంపై డానియల్ భార్య మాట్లాడుతూ, “ఉదయాన్నే లేచి నేనెవరో తెలియనట్టు చూశాడు. బాగా తాగేసి ఇంటికి వచ్చినట్టు అని, లేదా కిడ్నాప్ అయినట్టు భావించాడు. గది నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత అతనికి నేను తన భార్యని అని చెప్పడానికి ప్రయత్నించాను. ఆయన ఇంకా 90 దశకంలో ఉన్నట్టు భావించాడు. అద్దంలో చూసుకొని నేను ఇంత లావు అయ్యాను అని అరిచాడు.

A man lost his memory after waking up

డానియల్ ఒక హియరింగ్ స్పెషలిస్ట్. తన వృత్తి గురించి, చదివిన చదువు గురించి అన్ని మర్చిపోయాడు” అని చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే, మెమరీ లాస్ తర్వాత డానియల్ ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఇదంతా జరిగి ఆరు నెలలు అయ్యింది. ప్రస్తుతం డానియల్ చికిత్స పొందుతున్నాడు. అతనికి మెల్ల మెల్లగా అన్నీ గుర్తొస్తున్నాయి.


End of Article

You may also like