కూరగాయలు శానిటైజ్ చేయడానికి కొత్త టెక్నిక్…కానీ ఇలా చేయడం ప్రమాదమంట?

కూరగాయలు శానిటైజ్ చేయడానికి కొత్త టెక్నిక్…కానీ ఇలా చేయడం ప్రమాదమంట?

by Mohana Priya

Ads

శుభ్రం చేయడం, అది కూడా మామూలుగా శుభ్రం చేసే దానికంటే ఎక్కువగా శుభ్రం చేయడం ఇప్పుడు చాలా అవసరం అయిపోయింది. ముఖ్యంగా తినే వాటిమీద అందరూ అధిక శ్రద్ధ తీసుకుంటున్నారు. కూరలను పండ్లను ఉప్పు నీళ్లలో వేసి శుభ్రం చేస్తున్నారు. చాలా చోట్ల ఆహార పదార్ధాలని ఎలా శుభ్రపరచుకోవాలి అనేదాని మీద వివిధ మార్గాలను చెబుతున్నారు. ఇటీవల ఒక వ్యక్తి పండ్లను కూరగాయలను ఇలా కూడా శుభ్రపరుచుకోవచ్చు అని చూపించారు.

Video Advertisement

మనం అన్నం వండుకోవడానికి లేదా ఇంకేమైనా ఉడకబెట్టాల్సినప్పుడు కుక్కర్ పొయ్యిమీద పెడతాం కదా? అప్పుడు కుక్కర్ కి ఉన్న విజిల్ తీసేసి విజిల్ పెట్టే చోట ఒక పైప్ ని బిగించి, కుక్కర్ లో ఉన్నవి ఉడుకుతున్నప్పుడు వచ్చే ఆవిరి కూరగాయలపై వచ్చేలా పైపును పెడితే ఆ ఆవిరి ద్వారా కూరలు శుభ్రం అవుతాయి అని కుక్కర్ ఆవిరి ద్వారా కూరగాయలు శుభ్రపరిచే విధానాన్ని ఒక వ్యక్తి  వీడియో ద్వారా చూపించారు.

ఈ వీడియో ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహు దృష్టిలో పడింది. సుప్రియ సాహు ఈ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత వైవిధ్యంగా కూరలు శుభ్రం చేసిన అతని తెలివి ని సుప్రియ మెచ్చుకున్నారు. చాలా మంది నెటిజన్లు కూడా అతనిని అభినందిస్తున్నారు.

కానీ కొంతమంది మాత్రం ఇది సరైన పద్ధతి కాదు అని, ఎందుకంటే మనం వాడే పైప్ ప్లాస్టిక్ తో తయారు చేయబడిందని, కాబట్టి పైప్ ద్వారా వచ్చే ఆవిరి హానికరమైనది అని, అలా ప్లాస్టిక్ పైప్ ద్వారా వచ్చే ఆవిరి తో శుభ్రం చేసిన ఆహార పదార్థాలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని, దాని బదులు కొంచెం శ్రమ అయినా పర్లేదు ముందు గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి కూరగాయలను, పండ్లను కడిగి తర్వాత మళ్లీ మామూలు నీటితో శుభ్రపరిస్తే సరిపోతుంది అని అంటున్నారు.


End of Article

You may also like