రాఖీ పండుగ రోజు బీహార్ లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, బీహార్ లోని సరణ్ జిల్లా మాంఝీ శీతల్‌ పూర్ లో ఒక వ్యక్తి పాములని పెంచే వాడు. ఆ వ్యక్తి తన చెల్లితో, పాముకి కూడా రాఖీ కట్టాలని, పాము కూడా వారికి సోదరుడే అని చెప్పాడు. కానీ ఆ పాముకి రాఖీ కడుతున్న సమయంలో, ఆ పాము యువకుడిని కాటు వేసింది. దాంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతనిని హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు.bihar rakhi

సమయం కథనం ప్రకారం, ఆ యువకుడి పేరు మన్మోహన్ అని సమాచారం. శీతల్ పూర్ గ్రామానికి చెందిన దిగంబర్ సహా, మంజు కున్వర్ దంపతులకు నలుగురు సంతానం. వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు సులోచన. వారికి మన్మోహన్ రెండవ సంతానం. ఈ సంఘటనతో ఒక గ్రామం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. సులోచన ఇంక తాను రాఖీ పండుగ ఎప్పటికీ సంతోషంగా జరుపుకోలేని ఏమో అని బాధపడింది.

watch video :