ఎవరైనా ఏదైనా పని చేస్తే అది సక్సెస్ అవుతే, మనం కూడా అదే దారిలో వెళ్లి వాళ్లని అనుకరించాలని ప్రయత్నిస్తే బహుశా అన్ని సార్లు కరెక్ట్ గా వర్కౌట్ అవ్వకపోవచ్చు. వివరాల్లోకి వెళితే కేర‌ళ‌లోని మ‌నంత‌వాడి అనే ప్రాంతానికి చెందిన పీజే బిజు తన ఇన్నోవా ని ప్యారలల్ పార్కింగ్ చేశారు.

సాధారణంగా ప్యారలల్ పార్కింగ్ అనేది కొంచెం కష్టమైన పనే. కానీ బిజు చాలా సులభంగా ప్యారలల్ పార్కింగ్ చేయగలిగారు. అంతేకాకుండా అలా ప్యారలల్ పార్కింగ్ లో పార్కు చేసిన కారు ని మళ్లీ పార్కింగ్ నుండి బయటికి కూడా తీశారు. ఇదంతా పీజే బిజు భార్య వీడియో తీశారు.అప్పటి నుండి ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వాళ్ళు పీజే బిజు డ్రైవింగ్ స్కిల్స్ ని మెచ్చుకుంటున్నారు.

అంతేకాకుండా ఎంతోమంది,  వాళ్లు కూడా బిజు లాగానే కార్ పార్క్ చేసి మళ్లీ బయటికి తీయడానికి ప్రయత్నించారు. ఇటీవల ఒక వ్యక్తి ఇలాగే ప్యారలల్ పార్కింగ్ చేద్దామని ప్రయత్నించారు. ప్యారలల్ పార్కింగ్ చేస్తున్న క్రమంలో కార్ ముందుకి వెళ్లే పరిస్థితి లేక, వెనక్కి కూడా రాలేక అలాగే స్ట్రక్ అయిపోయింది. దాంతో ఆ వ్యక్తి  ప్యారలల్  గా పార్క్ చేయలేకపోయారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.